- Home
- Entertainment
- టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌తో అజిత్ 65వ సినిమా? కోలీవుడ్ ని షేక్ చేస్తున్న వార్త వైరల్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌తో అజిత్ 65వ సినిమా? కోలీవుడ్ ని షేక్ చేస్తున్న వార్త వైరల్
కోలీవుడ్ స్టయిలీష్ స్టార్ అజిత్ ఇటీవల `గుడ్ బ్యాడ్ అగ్లీ` మూవీతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఏకంగా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. దీనికితోడు కార్ రేసింగ్‌లోనూ సక్సెస్ జోరులో ఉన్నారు అజిత్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

Ajith
కొత్త దర్శకులందరికీ అజిత్, విజయ్, కమల్, రజనీ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీయాలనేది పెద్ద కల. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి సినిమాల్లో నటించరని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
టాప్ దర్శకుల ఫస్ట్ ఛాయిస్ అజిత్
స్టార్ దర్శకుల ఫస్ట్ ఛాయిస్ అజిత్: రజనీ, కమల్ ఇద్దరూ వయసుకు తగ్గ కథలు ఎంచుకుంటున్నారు. యాక్షన్ సినిమాలకు అజిత్ పర్ఫెక్ట్. తమ సినిమాలతో 500, 1000 కోట్లు వసూలు చేసిన దర్శకులు కూడా అజిత్ తో సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు ఆదిక్
అజిత్ తర్వాతి సినిమా ఎవరితో? 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా విజయవంతంగా ఆడుతున్న తరుణంలో, అజిత్ తర్వాతి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
పుష్ప దర్శకుడు సుకుమార్
అజిత్ 65వ సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతోంది.'పుష్ప' దర్శకుడు సుకుమార్: తాజాగా 'పుష్ప' దర్శకుడు సుకుమార్ అజిత్ 65వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ajith kumar film good bad ugly
అజిత్ ప్రస్తుతం కారు రేసింగ్‌లో ఉన్నారు. ఆ పోటీలు అయినపోయిన తర్వాత నెక్ట్స్ సినిమాకి సంబంధించిన వార్తలు రానున్నాయి. ఫస్ట్ అజిత్ 64 మూవీ కూడా ఫైనల్ చేయాల్సి ఉంది.
read more: సౌత్ లో హిట్, బాలీవుడ్ లో ఫ్లాప్ అయిన 7 స్టార్స్
also read: `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` మూవీ 5 రోజుల కలెక్షన్లు.. విజయశాంతి, కళ్యాణ్ రామ్‌కిది అసలు పరీక్ష