- Home
- Entertainment
- Pushpa Movie: 'పుష్ప' ఆఫర్ వచ్చినప్పుడు చేయనని చెప్పేశా.. 'రంగస్థలం' నటుడి షాకింగ్ కామెంట్స్
Pushpa Movie: 'పుష్ప' ఆఫర్ వచ్చినప్పుడు చేయనని చెప్పేశా.. 'రంగస్థలం' నటుడి షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఎక్కడ చూసినా Pushpa గురించే చర్చ జరుగుతోంది. బన్నీ, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఎక్కడ చూసినా పుష్ప గురించే చర్చ జరుగుతోంది. బన్నీ, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో లేనప్పటికీ అల్లు అర్జున్ తన నటనతో అదరగొట్టాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పుష్ప చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవుతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
Sukumar సినిమా కథ, పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయే పాత్రలు సృష్టిస్తారు ఆయన. పుష్ప చిత్రంలో ప్రేక్షులని ఆకట్టుకున్న పాత్రల్లో నటుడు Ajay Ghosh పోషించిన కొండారెడ్డి పాత్ర కూడా ఒకటి. ముఠా నాయకుడిగా కొండా రెడ్డి పాత్రలో మంచి నటన కనబరిచారు.
అజయ్ ఘోష్ కి సుకుమార్ రంగస్థలం చిత్రంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. శేషు నాయుడు పాత్రలో అజయ్ ఘోష్ అదరగొట్టాడు. దీనితో సుక్కు మరోసారి అతనికి పుష్పలో మంచి రోల్ ఇచ్చారు. ప్రస్తుతం పుష్ప టీం మొత్తం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అజయ్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో తనకి ఈ చిత్రంలో అవకాశం రావడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప చిత్రంలో నాకు అవకాశం వచ్చే సమయానికి నేను కరోనాతో బాధపడుతున్నాను. సుకుమార్ నుంచి ఒక రోజు పిలుపు వచ్చింది. అప్పుడే నేను కరోనా నుంచి కోలుకుంటున్నా. కానీ ముందు జాగ్రత్తగా బయటకు వెళ్ళేవాడిని కాదు. స్వతహాగా నాకు భయం ఎక్కువ. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండేవాడిని. ఎవ్వరితోనూ మాట్లాడలేదు కూడా. అలాంటి పరిస్థితుల్లో పుష్పలో ఛాన్స్ ఇస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పారు.
ఆ పరిస్థితుల్లో నాకున్న భయం కారణంగా పుష్పలో నటించలేనని చెప్పేశా. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు.. ఆలోచించుకోమని చెప్పారు. సినిమా చేయాలని నాకూ ఉంది. కానీ భయం కారణంగా నో చెప్పేశా. దీనితో స్వయంగా సుకుమార్ గారే నాకు ఫోన్ చేశారు. నాలో ధైర్యం నింపారు. చాలా గౌరవంగా చూసుకున్నారు. ఆయన సపోర్ట్ తోనే కొండారెడ్డి పాత్రలో అంత బాగా నటించగలిగాను. సుకుమార్ గారు నాకు డైరెక్టర్ గా కాదు ఒక దేవ దూతలా కనిపిస్తారు అని అజయ్ ఘోష్ ప్రశంసలు కురిపించారు.
పుష్ప, రంగస్థలం చిత్రాలు నటుడిగా అజయ్ ఘోష్ కి తిరుగులేని గుర్తింపు తీసుకు వచ్చాయి. సునీల్, అనసూయ ఇతర పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఫిబ్రవరి నుంచి పుష్ప రెండవ భాగం పుష్ప ది రూల్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. Also Read: Biggboss telugu 5:రూ. 25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్న టాప్ కంటెస్టెంట్.. ఫ్యాన్స్ కి భారీ షాక్
Also Read: Pushpa Romantic Scene: పుష్ప మూవీ నుంచి ఆ... సీన్ కట్... అంత ఘోరంగా ఉందా..?