- Home
- Entertainment
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో సినిమా స్టూడియో.. `ఆర్‌ఆర్‌ఆర్` స్టార్ భారీ ప్లాన్, సీఎంతో చర్చలు
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో సినిమా స్టూడియో.. `ఆర్‌ఆర్‌ఆర్` స్టార్ భారీ ప్లాన్, సీఎంతో చర్చలు
హైదరాబాద్‌లో అప్పటికే పలు ఫిల్మ్ స్టూడియోలున్నాయి. ఇప్పుడు మరో స్టూడియో రాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియోకి ప్లాన్ జరుగుతుంది.

ఇండియన్ సినిమాకి ల్యాండ్ మార్క్ గా తెలుగు చిత్ర పరిశ్రమ
తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాలు రూపొందుతున్నాయి.
అల్లు అర్జున్-అట్లీ మూవీని హాలీవుడ్‌కి తక్కువ కాకుండా రూపొందించే పనిలో ఉన్నారు. మరోవైపు మహేష్ బాబుతో రాజమౌళి సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమా తెరకెక్కిస్తున్నారు.
దీంతో తెలుగు చిత్రపరిశ్రమ గురించే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. అదే సమయంలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇక్కడే రూపొందుతున్నాయి.
ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మూవీస్ రూపొందుతుండటం విశేషం. వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం ఉన్న సినిమాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.
తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా ఇలాంటి మూవీస్‌కి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో కొత్తగా ఓ అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో స్టూడియోకి ప్లాన్ జరుగుతుంది.
హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియోలు
ఇప్పటికే మన హైదరాబాద్‌లో పలు స్టూడియోలున్నాయి. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారధి స్టూడియోలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటితోపాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిన ప్రపంచస్థాయి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది.
అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియో నిర్మిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. ఇంకోవైపు దిల్ రాజు ఏఐ ఆధారిత స్టూడియో ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్టూడియో
వీటికితోడు ఇప్పుడు హైదరాబాద్‌లో మరో భారీ స్టూడియో రాబోతుంది. అంతర్జాతీయ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ జరుగుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` నటుడు, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన విధివిధానాలు, ప్లానింగ్‌తో కూడిన ప్రతిపాదనని సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించారు. గత వారం అజయ్ దేవగన్ దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని అధికారిక నివాసంలో కలిశారు.
ఈ ప్రతిపాదనపై చర్చించారు. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ఏఐ ఆధారిత సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాల స్టూడియో కోసం ప్రణాళికలను దేవగన్ సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అజయ్ దేవగన్
ఇందులో చిత్ర పరిశ్రమకు నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్యాభివృద్ధి సంస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యాన్ని కూడా అజయ్ దేవగన్ సీఎంకి ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా ఆయన చెబుతూ ఇండియాలోనే సినిమా మౌలిక సదుపాయాలకు తెలంగాణ ప్రముఖ గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
అదే సమయంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ప్రభుత్వ చొరవలను సీఎం అజయ్ దేవగన్‌కి వివరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దేవగన్ అభినందించారు. సినిమా, మీడియా ద్వారా రైజింగ్ తెలంగాణను ప్రోత్సహించడానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నానని అజయ్ దేవగన్ చెప్పడం విశేషం.
అజయ్ దేవగన్ ప్రతిపాదనకు సానుకూలంగా సీఎం
ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ని కలిశాను. హైదరాబాద్‌లో సినిమాలలో సాంకేతికతను, ముఖ్యంగా యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ప్రపంచ స్థాయి నాణ్యమైన డిజైన్, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలను ప్రోత్సహించే తన వెంచర్ గురించి చర్చించారు.
ఆయన తన సొంత పెట్టుబడి ద్వారా అత్యుత్తమ నిపుణులు, సాంకేతిక నిపుణులను తీసుకురావడంలో గొప్ప ఆసక్తిని కనబరచడమే కాకుండా, మీడియా, సినిమాలు, వినోద రంగాలలో తెలంగాణ రైజింగ్ కోసం బ్రాండ్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీపై త్వరలో అధికారిక ప్రకటనలతో సానుకూల వార్తలను వింటాము` అని రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా ప్రకటించారు.
సీఎం చెప్పినదాన్ని బట్టి అజయ్ దేవగన్‌కి హైదరాబాద్‌లో స్టూడియో నిర్మాణానికి పర్మిషన్ దొరికినట్టే అని తెలుస్తోంది. మరి దీనిపై టాలీవుడ్ మేకర్స్, నిర్మాతలు, స్టార్ హీరోల రియాక్షన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.