- Home
- Entertainment
- Lal Salaam : మా నాన్నకి బిల్డప్ ఇవ్వాలనుకున్నాం, అక్కడే తేడా కొట్టింది..తప్పు ఒప్పుకున్న రజనీ కూతురు
Lal Salaam : మా నాన్నకి బిల్డప్ ఇవ్వాలనుకున్నాం, అక్కడే తేడా కొట్టింది..తప్పు ఒప్పుకున్న రజనీ కూతురు
సూపర్ స్టార్ రజనీకాంత్ ని చూపించాల్సిన విధంగా చూపిస్తే యావరేజ్ స్టోరీ కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. జైలర్ చిత్రం ఆ విషయాన్ని నిరూపించింది. అలా కాదని రజనీ ఇమేజ్ వాడుకుంటూ ప్రయోగాలు చేస్తే చేతులు కాలడం ఖాయం.

Aishwarya Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ ని చూపించాల్సిన విధంగా చూపిస్తే యావరేజ్ స్టోరీ కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. జైలర్ చిత్రం ఆ విషయాన్ని నిరూపించింది. అలా కాదని రజనీ ఇమేజ్ వాడుకుంటూ ప్రయోగాలు చేస్తే చేతులు కాలడం ఖాయం. ఆ విధంగా చేతులు కాల్చుకున్న వారిలో రజనీకాంత్ కూతుళ్లే ముందు వరుసలో ఉంటారు.
పదేళ్ల క్రితం రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీ.. తన తండ్రితో ఒక విజువల్ ఎఫెక్ట్స్ మూవీ అంటూ యానిమేషన్ బొమ్మల చిత్రం కొచ్చాడియాన్ తెరకెక్కించింది. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని నష్టాలు ఎదురయ్యాయి. కొచ్చాడియాన్ దారుణ పరాజయం చెందింది. తాజగా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా తన వంతు చెల్లించుకుంది.
జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజని నటిస్తున్న చిత్రం అంటే హైప్ ఆకాశాన్ని తాకేలా ఉండాలి. కానీ లాల్ సలామ్ చిత్ర పరిస్థితి ఫ్యాన్స్ కి కూడా రిలీజ్ కి ముందే అర్థం అయిపోయింది. ఇక రిలీజ్ అయ్యాక ఆ కలెక్షన్స్ చూస్తే ఇది రజనీ చిత్రమేనా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ లలో లాల్ సలామ్ ఒకటిగా నిలిచింది.
Aishwarya Rajinikanth
రిలీజ్ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఎక్కడా ముఖం కూడా చూపించలేదు. ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య దర్శకురాలిగా తన తప్పుని ఒప్పుకుంది. లాల్ సలామ్ చిత్రం నిరాశపరచడానికి బాధ్యత తనదే అని తెలిపింది. అయితే ఈ చిత్రం ఇంత దారుణంగా డిజాస్టర్ కావడానికి కారణం తన తండ్రి పాత్రే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
వాస్తవానికి ఈ చిత్ర కథ రాసుకున్నప్పుడు రజనీ పాత్రని కేవలం 10 నిముషాలు మాత్రమే అనుకున్నాం. రజనీ లాంటి సూపర్ స్టార్ ని 10 నిమిషాలకు మాత్రమే పరిమితం చేస్తే బాగోదు అని ఇంకాస్త పెంచాం. అప్పుడే మేము అనుకున్న ఒరిజినల్ స్టోరీ దెబ్బ తినింది.
రజనీకాంత్ ఉన్నప్పుడు ఫైట్లు, ఎంట్రీ గట్రా బిల్డప్ లు అవసరం. లేకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. దీనితో ఫైట్స్, ఎంట్రీ సీన్ పెట్టాం. ఫలితంగా కథ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. విష్ణు విశాల్ సహా చాలా మంది పత్రాలు, మేము చెప్పాలనుకున్న పాయింట్ హైలైట్ కాలేదు అని ఐశ్వర్య రజనీకాంత్ పేర్కొంది. జరిగిన తప్పుల నుంచి భవిష్యత్తులో గుణపాఠాలు నేర్చుకుంటా అని ఐశ్వర్య పేర్కొంది.