- Home
- Entertainment
- ట్రెండీ గౌన్ లో డస్కీ బ్యూటీ పరువాల విందు.. మత్తు చూపులతో కవ్విస్తున్న ఐశ్వర్యా రాజేశ్.!
ట్రెండీ గౌన్ లో డస్కీ బ్యూటీ పరువాల విందు.. మత్తు చూపులతో కవ్విస్తున్న ఐశ్వర్యా రాజేశ్.!
డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) ట్రెండీ గౌన్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. ఇటీవల ‘సైమా2022’ అవార్స్ ఫంక్షన్ హాజరైన ఈ బ్యూటీ ట్రెడిషనల్ వేర్ లో మతిపోగొట్టింది.

తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కు సౌత్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ సినిమాల్లో పాత్ర విషయానికొస్తే ఎంతటి సాహసమైన చేస్తుంది. ప్రేక్షకులు మెచ్చే రోల్స్ లో నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.
ఇటీవల వేకేషన్ సందర్భంగా విదేశాలకు వెళ్లిన ఈ బ్యూటీ ఫ్రాన్స్ లోని నగరాలను చుట్టేసి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడి నగర వీధుల్లో ఈ బ్యూటీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఆ ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
తాజాగా ఈ బ్యూటీ ‘సైమా2022’ అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా హాజరైంది. ‘తిట్టమిరండు’ అనే చిత్రంలో బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్)గా సైమా అవార్డును అందుకుంది. తనకు అవార్డు వచ్చిన సందర్భంగా డైరెక్టర్ మరియు చిత్ర యూనిట్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.
అయితే, ఈవెంట్ కు హాజరైన తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ట్రెండీ గౌన్ లో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ లుక్ లో ఈవెంట్ లో అట్రాక్టివ్ గా నిలిచింది. మరోవైపు అదే అవుట్ ఫిట్ లో మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను తాజాగా తన అభిమానులతో పంచుకుంది.
ఈ పిక్స్ లో ఐశ్వర్యా రాజేష్ అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లోనూ పరువాల విందు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా డస్కీ బ్యూటీ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. నెటిజన్లు కూడా ఐశ్వర్యా అందాలకు ఫిదా అవుతున్నారు.
ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులో చివరిగా ‘టక్ జగదీష్’,‘రిపబ్లిక్’ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం
ఆమె ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. ఐశ్వర్య నటించిన ‘డ్రైవర్ జమున’, ‘తీయవర్ కులైగల్ నడుంగ’, ‘మోహన్ దాస్’, ‘పులిమడ’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘ధ్రువ నక్షత్రం’ చిత్రాలు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. తర్వలోనే విడుదల కానున్నాయి.