- Home
- Entertainment
- Aishwarya Rajesh : సన్ గ్లాసెస్ పెట్టుకున్న వెన్నెలా ఐశ్వర్య రాజేష్.. కూల్ పిక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది..
Aishwarya Rajesh : సన్ గ్లాసెస్ పెట్టుకున్న వెన్నెలా ఐశ్వర్య రాజేష్.. కూల్ పిక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది..
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను మెప్పించడంలో ఐశ్వర్య మేటి. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ కేరీర్ లో స్పీడ్ పెంచిందీ బ్యూటీ.

డస్కీ స్కిన్ టోన్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను వరుస సినిమాలతో అలరిస్తోంది. అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు సోషల్ మీడియాలోను ఈ బ్యూటీ అభిమానులకు టచ్ లోనూ ఉంటోంది.
ఎప్పటికప్పుడు తన విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుటోంది. అయితే గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ సుందరి. కొద్ది రోజుల నుంచి ఆ దిశగా అడుగులెస్తోంది. ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది.
అదే సమయంలో తన ఘాటైన అందాలతోనూ మతిపోగొడుతుంది. స్కిన్ షోకి దూరంగా ఉండే ఈ భామ ఉన్నట్టుంది హాట్ షోతో రెచ్చగొడుతుంది. తాజాగా మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోల్లో మెస్మరైజ్ చేసే లుక్స్ తో మతిపోగొట్టింది ఐశ్వర్య రాజేష్. సన్ గ్లాసెస్, పర్పుల్ కలర్ స్వెటర్ ధరించి కూల్ పిక్స్ కు స్టిల్స్ ఇచ్చింది. హ్యాండ్స్ ను పైకెత్తి, తన నడుముు అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది.
అయితే, ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ, పెర్షియన్ పోయెట్ ‘రూమి’ కోట్స్ ను యాడ్ చేసింది. ‘మీ జీవితానికి నిప్పు పెట్టండి.. ఆ జ్వాలలను అభిమానించే వారి కోసం వెతకండి’ అంటూ రూమి కొటేషన్ తో నెటిజన్ల అభిమానాన్ని దోచుకుంది.
రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా పాత్రకి ప్రయారిటీ ఉన్న, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ రాణిస్తుంది ఐశ్వర్య. `మిస్‌మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. ప్రస్తుతం తెలుగులోనే `ది గ్రేట్ ఇండియా కిచెన్` రీమేక్‌లో నటిస్తోంది. తమిళంలో `డ్రైవర్ జమునా`, `మోహన్‌దాస్`, మలయాళంలో `పులిమడ` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.