- Home
- Entertainment
- ఐశ్వర్య రాయ్-అభిషేక్ పెళ్లికి పిలవలేదని అలిగిన స్టార్ హీరో, బచన్ ఫ్యామిలీపై మండిపడిన సీనియర్ నటుడు ఎవరు?
ఐశ్వర్య రాయ్-అభిషేక్ పెళ్లికి పిలవలేదని అలిగిన స్టార్ హీరో, బచన్ ఫ్యామిలీపై మండిపడిన సీనియర్ నటుడు ఎవరు?
Aishwarya Rai Abhishek Bachchan Wedding Drama: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి అప్పట్లో ఓ పెద్ద చర్చకు దారి తీసింది. తనను పెళ్ళికి పిలవలేదంటూ బాలీవుడ్ ్టార్ నటుడు కోపంతో రగిలిపోయాడు. బచ్చన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్వీట్స్ ను ఆయన తిరిగి వెనక్కు పంపించేశాడు. ఇంతకీ ఎవరా స్టార్.

Aishwarya Rai Abhishek Bachchan Wedding Drama : ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి అప్పట్లో చాలా పెద్ద వార్త అయింది. అప్పుడు జరిగిన ఓ విచిత్ర సంఘటన గురించి ఇప్పటికీ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు ఈ పెళ్లి గురించి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అది పెద్ద టాపిక్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే?
శత్రుఘ్న సిన్హా ఊహించని రియాక్షన్
ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి పిలవకపోవడం వల్ల తన మనసుకి ఎంత బాధ కలిగిందని బాలీవుడ్ స్టార్ నటుడు శత్రుఘ్న సిన్హా చెప్పారు. బచ్చన్ ఫ్యామిలీతో మంచి స్నేహం ఉందని, తనని పిలవకపోవడం బాధ కలిగించిందని అన్నారు. ఈ అసంతృప్తిని అతను బహిరంగంగానే వెల్లడించడంతో..ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
పెళ్లి స్వీట్లు తిరస్కరించిన శత్రుఘ్న సిన్హా
పెళ్లి తర్వాత ఐశ్వర్య, అభిషేక్ స్వీట్లు పంపితే శత్రుఘ్న సిన్హా వాటిని వెనక్కి పంపించేశారు. పెళ్లికి పిలవనప్పుడు స్వీట్లు ఎందుకని ఆయన అన్నారు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి పెద్ద చర్చకు దారి తీసింది.
అమితాబ్ బచ్చన్‌ను ప్రశ్నించిన శత్రుఘ్న సిన్హా
అమితాబ్ బచ్చన్ కూడా తనను పెళ్లికి పిలవలేదని శత్రుఘ్న సిన్హా అన్నారు. స్నేహితుడిగా భావించే తనను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఆయన కామెంట్స్ అప్పట్లో రచ్చ రచ్చ చేశాయి. దానికోసం బచన్ ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.
పిలవకపోవడానికి అసలు కారణం
అమితాబచ్చన్ తల్లి తేజీ బచ్చన్ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల పెళ్లిని చాలా సింపుల్‌గా చేశామని అభిషేక్ బచ్చన్ వివరణ ఇచ్చారు. అందుకే బాలీవుడ్ స్టార్స్‌ను పిలవలేదని, ఎక్కువ హడావుడి వద్దనుకున్నామని ఆయన అప్పుడు అన్నారు.
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి 2007 ఏప్రిల్ 20న జరిగింది. వీరికి 2012 లో ఆధ్య అనే కూతురు కూడా పుట్టింది. ఇక ఈమధ్య వరకూ వీరు విడాకులు తీసుకోబోతున్నారంటు పుకార్లు బాలీవుడ్ అంతటా వ్యాప్తించాయి. అయితే ఈ విషయంలో ఇద్దరు స్టార్లు ఇంత వరకూ స్పందించలేదు.