ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య స్కూల్ ఫీజు అంతా..? వింటే షాక్ అవుతారు
సెలబ్రిటీల ల లగ్జరీలైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాసెలబ్రిటీలు అయితే.. కాస్ట్యూమ్స్.. జువ్వెల్లరీ లాంటివి అటుంచితే.. స్టార్స్ కిడ్స్ చదువులు విషయంలో కూడా లక్షల్లో పోస్తుంటారు.. ఈక్రమంలో తాజాగా ఐశ్వర్య రాయ్ గారాల కూతురు ఆరాధ్య స్కూల్ ఫీజ్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది.
Aaradhya Bachchan
సెలబ్రిటీల ల లగ్జరీలైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాసెలబ్రిటీలు అయితే.. కాస్ట్యూమ్స్.. జువ్వెల్లరీ లాంటివి అటుంచితే.. స్టార్స్ కిడ్స్ చదువులు విషయంలో కూడా లక్షల్లో పోస్తుంటారు.. ఈక్రమంలో తాజాగా ఐశ్వర్య రాయ్ గారాల కూతురు ఆరాధ్య స్కూల్ ఫీజ్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది.
సెలబ్రిటీలు.. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల జీవితాలు ఎంత లగ్జరీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్లు, బంగ్లాలు, కాస్ట్రీమ్స్.. నగలు, పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా ఎన్నో ఉంటాయి. వాటితో పాటు వారి పిల్లల చదువుల విషయంలో కూడా వారు కాస్ట్లీగానే ఆలోచిస్తారు.
ప్రతీ చిన్న విషయంలో స్టార్స్ లగ్జరీగానే ఆలోచిస్తారు.. అలాంటిది అత్యవసరాల విషయాలలో వారి ఖర్చు అత్యధికంగానే ఉంటుంది అని అనుకోవచ్చు. అంతే కాదు అలా ఖర్చు పెట్టడానికి కూడా వారు ఏమాత్రం వెనకాడరు. చాలామంది సినీ సెలబ్రిటీలు తాము సంపాదించేంది చాలావరకు తమ పిల్లల విలాసవంతమైన జీవితం కోసమే ఖర్చుపెడతారు. అలాంటివారిలో బాలీవుడ్ భామ ఐశ్వర్యా రాయ్ కూడా ఉంది.
బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య చదువు కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా..? ఈ విషయం తాజాగా వైరల్ అవుతోంది.ఈరోజుల్లో పిల్లను చదించిండం అంటే.. స్కూల్ ఫీజులు లక్షల్లో కుమ్మరించాలి. అది అందరికి తెలిసిందే. సాధారణ మిడిల్ క్లాస్ జీవితాలు గడిపేవారు కూడా పిల్లల స్కూలు ఫీజులు కోసం లక్షలు ఖర్చుపెట్టడానికి వెనకాడడం లేదు. అలాంటిది సెలబ్రిటీ ఇంకెంత పెట్టాలి.
Aaradhya Bachchan
కోట్లలో సంపాదించే ఐశ్వర్య రాయ్ లాంటి రాయల్ ఫ్యామిలీ పిల్లలకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద విషయమేమీ కాదు. అయినా కూడా తమ కూతురు చదువు కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. వారి కూతురు ఆరాధ్య ముంబాయ్‌లోని అత్యంత ఖరీదైన స్కూలులో చదువుతోంది. అదే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్ ఫీజులు భారీగా ఉంటాయని సమాచారం.
ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు 10 లక్షల వరకు ఉంటుందట. ఎల్‌కేజీ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా ఫీజ్ ఉంటుందట. అది కాకుండా పైన ఖర్చులు కూడా భారీగానే ఉంటాయని సమాచారం. ఇక 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు... ఆతరువాత ప్లస్ 1 ప్లస్ 2 గా పిలవబడే.. 11,12 ఇంటర్మీడియల్ క్లాసులకు కూడా 15 నుంచి 20 లక్షల పైనే ఫీజులు ఉంటాయంటున్నారు.
అయితే ఈ విషయం సోషల్ మీడియా సమాచారం ప్రకారం చెపుతున్నదే కాని.. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే ఇదే స్కూల్ లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కూతురు ఆరాధ్య మాత్రమే కాకుండా.. మరికొంత మంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారట.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రహం కూడా ఈ స్కూల్‌లోనే చదువుతున్నాడు. వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, చుంకీ పాండే తదితర సెలబ్రిటీల పిల్లలు కూడా ఇదే స్కూల్‌లో తమ చదువును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య 6వ తరగతి చదువుతోందట.
బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. కాని అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆమె పొన్నియన్ సెల్వన్ సినిమాలో మెరిసింది. అటు అభిషేక్ బచ్చన్ కూడా సినిమాలు చేయడం మానేశారు. కాని అభిషేక్ తండ్రి.. బాలీవుడ్ మెగాస్టార్ .. బిగ్ బీ అమితాబచ్చన్ మాత్రం ఇప్పటికీ ఫుల్ ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నారు. వరుసగా సినిమాలతో పాటు.. టీవీ షోలు కూడా చేస్తున్నాడు.