MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా

Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల దర్శకత్వంలో నటించాల్సిన ఒక సినిమాని అగ్ర హీరో ఒకరు రిజెక్ట్ చేశారు. నమ్మక ద్రోహానికి కృష్ణ చెప్పిన సమాధానం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 07 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ
Image Credit : Asianet News

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ అగ్ర హీరోగా వెలుగొందుతున్న సమయంలో విజయ నిర్మలతో వివాహం జరిగింది. విజయ నిర్మల హీరోయిన్ గా దర్శకురాలిగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. దర్శకురాలిగా ఆమె అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. కృష్ణకి పోటీగా అప్పట్లో శోభన్ బాబు ఉండేవారు. కుటుంబ కథా చిత్రాలతో శోభన్ బాబుకు ఎక్కువ క్రేజ్ దక్కింది. మహిళా ప్రేక్షకుల ఆదరణ ఆయనకు ఎక్కువగా ఉండేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరుస ఫ్లాపుల్లో శోభన్ బాబు
Image Credit : suresh productions

వరుస ఫ్లాపుల్లో శోభన్ బాబు

అయితే శోభన్ బాబు ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. శోభన్ బాబు నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో అవకాశాలు తగ్గాయి. ఆ టైంలో శోభన్ బాబు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, తన కాంబినేషన్ లో సినిమా వస్తే మంచి క్రేజ్ ఉంటుంది అని, హిట్ కూడా అవుతుందని శోభన్ బాబు భావించారు. ఈ మేరకు కృష్ణకి వేరే వ్యక్తితో చెప్పి పంపించారు.

35
శోభన్ బాబుకి మళ్ళీ క్రేజ్
Image Credit : our own

శోభన్ బాబుకి మళ్ళీ క్రేజ్

కృష్ణ వెంటనే స్పందించి తప్పకుండా సినిమా చేస్తాం. మా బ్యానర్ లో నేనే నిర్మిస్తా. విజయ నిర్మల దర్శకురాలు అని చెప్పి 25 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చి పంపినట్లు కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కృష్ణ మాట్లాడుతూ.. కథ మొత్తం రెడీ అయింది. ఇంతలోపు శోభన్ బాబు నటించిన మల్లెపువ్వు చిత్రం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. శోభన్ బాబుకి మళ్ళీ క్రేజ్ వచ్చేసింది.

45
శోభన్ బాబు నమ్మక ద్రోహం, ముందే ముందే ఊహించిన కృష్ణ
Image Credit : Asianet News

శోభన్ బాబు నమ్మక ద్రోహం, ముందే ముందే ఊహించిన కృష్ణ

నా కెందుకో మన సినిమాలో శోభన్ బాబు నటించడేమో అని అనిపిస్తోంది. శోభన్ బాబు సినిమా హిట్ అయింది కదా అని విజయ నిర్మలతో అన్నాను. ఆ తర్వాత కథ వినిపించడానికి శోభన్ బాబు వద్దకు వేరే వ్యక్తిని పంపాం. అనుకున్నట్లుగానే శోభన్ బాబు ఈ కథ నాకు నచ్చలేదు అని రిజెక్ట్ చేశారు. అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడు. శోభన్ బాబు అలా చేయడం ఏమాత్రం నచ్చలేదు అని కృష్ణ అన్నారు. ఇంతకంటే మనం క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేయాలి అని విజయ నిర్మలకు చెప్పా.

55
సరైన జవాబు ఇచ్చిన కృష్ణ
Image Credit : Asianet News

సరైన జవాబు ఇచ్చిన కృష్ణ

వెంటనే ఏఎన్నార్ గారి వద్దకు వెళ్ళా. ఏమిటోయ్ ఇలా వచ్చావ్ అన్నారు. మనిద్దరం సినిమా చేయాలి అని అడిగా. తప్పకుండా చేస్తాను. కానీ దేవదాసు వల్ల మన మధ్య వచ్చిన విభేదాలు ఇక ఉండకూడదు. మనిద్దరం ఇకపై స్నేహంగా సరదాగా ఉండాలి అని అన్నారు. తప్పకుండా అలాగే ఉందాం అని చెప్పాను. అమితాబ్ డాన్ సినిమా ఇన్సిపిరేషన్ తో కొత్త కథ రెడీ చేశాం. ఆ కథతోనే హేమా హేమీలు అనే సినిమా తెరకెక్కించాం. విజయ నిర్మల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందింది. సూపర్ డూపర్ హిట్ అయింది. నేను రిజెక్ట్ చేసిన తర్వాత ఇంత త్వరగా వీళ్ళు ఎలా అద్భుతమైన సినిమా తీశారు అని శోభన్ బాబు ఆశ్చర్యపోయినట్లు కృష్ణ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
NTR: అత్తారింటికి దారేది హీరోయిన్లతో రొమాన్స్, వద్దని చెప్పినా వినని స్టార్ హీరో.. మొత్తం దెబ్బైపోయారు
Recommended image2
Malaika Arora: వయసు 52 ఏళ్ళు, కానీ ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా.. మలైకా దెబ్బకు సోషల్ మీడియా షేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved