MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ... రవితేజ మూవీలో రేణూ రోల్ ఏంటీ? ఆ తెల్ల బట్టలకు అర్థం ఏమిటీ?

18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ... రవితేజ మూవీలో రేణూ రోల్ ఏంటీ? ఆ తెల్ల బట్టలకు అర్థం ఏమిటీ?

రేణూ దేశాయ్ రీ ఎంట్రీకి సర్వం సిద్ధం. ఆమె సినిమాల్లోకి రానున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అలాగే మంచి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించాలని రేణూ సైతం ఆతృతగా ఉన్నారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీతో అది సాకారమైంది.

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 29 2022, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Renu Desai

Renu Desai


2000 సంవత్సరంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సూపర్ హిట్. న్యూ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీతో మోడల్ రేణూ దేశాయ్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె జీవితంలో రియల్ లవ్ స్టోరీ మొదలైపోయింది. పవన్-రేణూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. 

28
Pawan Kalyan-Renu Desai

Pawan Kalyan-Renu Desai

ఆమెతో పెళ్లికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ సినిమాలు మాన్పించేశాడు. అప్పటికే ఒప్పుకున్న ఓ తమిళ చిత్రం పూర్తి చేసి కొత్త సినిమాలకు సైన్ చేయడం ఆపేసింది. ఇక పవన్ నటించే చిత్రాలకు రేణూ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసేవారు. ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్... బాగా గ్యాప్ ఇచ్చి జానీ చిత్రం చేశారు.

38
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines

పవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ హీరోయిన్ గా తన లవర్ రేణూనే ఎంచుకున్నాడు. జానీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. 2003లో జానీ విడుదల కాగా రేణూ దేశాయ్ కి అదే చివరి చిత్రం. తర్వాత రేణూ దేశాయ్ జీవితం అనేక మలుపులు తిరిగింది. పవన్ తో పెళ్లి, పిల్లలు, విడాకులు జరిగిపోయాయి. 
 

48

2012 లో పవన్ కళ్యాణ్ అధికారికంగా రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత రేణు మకాం పూణెకి మార్చేశారు. అక్కడే పిల్లలతో జీవనం సాగించారు. ఈ మధ్యలో రెండో పెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు. దాన్ని పవన్ అభిమానులు వ్యతిరేకించారు. ఆమెపై సోషల్ మీడియా వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారు. 
 

58
Renu Desai

Renu Desai

కొన్నాళ్ల క్రితం రేణూ దేశాయ్ హైదరాబాద్ కి మారారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఉంటున్నారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రేణూ దేశాయ్ కి రవితేజ మూవీలో ఒక ఆఫర్ వచ్చింది. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా అదే టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది.

68
Renu Desai

Renu Desai


రవితేజ టైటిల్ రోల్ చేస్తుండగా... దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. కాగా నేడు టైగర్ నాగేశ్వరరావు మూవీ నుండి రేణూ దేశాయ్ ప్రీ లుక్ విడుదల చేశారు. 

78
Renu Desai

Renu Desai


18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ప్రీ లుక్ వీడియోలో వెల్లడించారు. ఇక ఈ మూవీలో రేణూ దేశాయ్ పేరు హేమలత లవణం అని తెలుస్తుంది. రేణూ దేశాయ్ తెల్లబట్టలు ధరించి ఉన్నారు. ఆమె వెనుక మరొక ఇద్దరు స్త్రీలు నడుస్తున్నారు. 
 

88
Renu Desai

Renu Desai


రేణూ దేశాయ్ లుక్ చూస్తుంటే ఆమె క్రిస్టియన్ నన్ వలె ఉంది. పవర్ ఫుల్ రోల్ అంటున్నారు కాబట్టి ఆమె నన్ గా కనిపిస్తారని చెప్పలేం. మొత్తంగా రేణూ దేశాయ్ ప్రీ లుక్ వీడియో మూవీపై అంచనాలు పెంచేసింది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక రేణూ సెకండ్ ఇన్నింగ్స్ ఈమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved