- Home
- Entertainment
- Akira Nandan: అకీరా నాకు బాగా క్లోజ్, అతడికి ఇష్టమో లేదో కూడా తెలియదు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్
Akira Nandan: అకీరా నాకు బాగా క్లోజ్, అతడికి ఇష్టమో లేదో కూడా తెలియదు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్
వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజర్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేజర్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా మేజర్ ప్రచార కార్యక్రమాలతో అడివి శేష్ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అకీరాతో అడివి శేష్ మల్టి స్టారర్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనిని అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమి ఉండదు. అసలు అకీరాకి యాక్టింగ్ ఇష్టమో లేదో కూడా తెలియదు. అకీరాకి మ్యూజిక్ అంటే ఇష్టం. అడివి శేష్ కి తెలుగులో గుర్తింపు తెచ్చిన చిత్రం పంజా. అప్పటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా రెస్పెక్ట్ అని అడివి శేష్ తెలిపాడు.
అకీరా నా హార్ట్ కి చాలా క్లోజ్. నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడింది చాలా తక్కువ. కానీ అకీరాతో తరచుగా మాట్లాడుతూ ఉంటాను అని అడివి శేష్ తెలిపారు. అకీరా ప్లే చేసిన మ్యూజిక్ బైట్స్ ని నాకు సెండ్ చేస్తూ ఉంటాడు అని అడివి శేష్ అన్నారు.
అకీరా, నేను మంచి ఫ్రెండ్స్. అంతే కానీ సినిమాల గురించి మా మధ్య డిస్కషన్ లేదు అని అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అకిరా స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మెగా ఫ్యామిలీలోనే బాగా హైట్ ఉన్న వ్యక్తిగా అకిరా మారిపోయాడు. సినిమా హీరోకి కావలసిన కటౌట్ రెడీ అయింది అంటూ మెగా ఫాన్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పియానో, మ్యూజిక్ తో పాటు అకీరా మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. మరి అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తాడో చూడాలి.