- Home
- Entertainment
- Devatha: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన భాగ్యమ్మ.. దేవి గూడెం వైపు వెళ్ళిందంటూ ఆదిత్య కు వచ్చిన ఇన్ఫర్మేషన్!
Devatha: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన భాగ్యమ్మ.. దేవి గూడెం వైపు వెళ్ళిందంటూ ఆదిత్య కు వచ్చిన ఇన్ఫర్మేషన్!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. భాషా, సూరి ఇద్దరు కరెన్సీ కి ఐస్క్రీమ్ ఇస్తారు. అప్పుడు కరెన్సీ మంచం మీద కూర్చొని రెండు చేతులతో రెండు ఐస్ క్రీములు తింటూ ఉంటాడు. నీకు మేపడానికే నా సంపద అయిపోతుంది అని అంటాడు భాషా. దానికి కరెన్సీ అయితే నన్ను వెళ్లిపోమంటారా అని అనగా ఒద్దు లే కానీ మీ నాన్న పాటికి వచ్చేయాలి కదా ఇంకా రాలేదు ఏంటి అని అంటారు వాళ్ళు. మరి వెళ్లి ఫోన్ చేయండి అని అంటాడు కరెన్సీ. దానికి సూరి భాషా బయటకు వెళ్లి ఫోన్ చేస్తారు. అప్పుడు కరెన్సీ ఐస్ క్రీమ్ పక్కన పెట్టి ఫోన్ ఎత్తి, నేను రావాలనుకున్నాను అండి.
మీరు చెప్పిన డబ్బులు ఒక బ్యాగ్ లో పెట్టి ఎయిర్పోర్ట్ ఎదురుకుంటా ఉన్నాను తిరిగి చూసేసరికి నా పర్స్ పోయింది. నా పర్స్ పోయిందని వెళ్లేసరికి ఎవరో డబ్బులున్న బ్యాగ్ కొట్టేశారు. ఆ కంగారులో నేను ఫ్లైట్ వెళ్లిపోయిన సంగతే మర్చిపోయాను అని అనగా ఆ మాటలకు భాష, సూరి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎలాగా వస్తారు అని అనగా ఇప్పుడు మీరు నాకు ఒక 50,000 పంపినట్టయితే నేను ఎక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డబ్బులు అరేంజ్ చేస్తాను అని అనగా అన్ని డబ్బులు ఉన్నాయి కదా మీకు 50,000 ఉండవా ఏంటి అని అడుగుతాడు భాష.
దానికి కరెన్సీ, 50 వేలే కదా కేవలం 50000 కోసం వేరే వాళ్ళని అడగడం నాకు ఇష్టం లేదు అని ఫోన్ పెట్టేస్తాడు. దానికి భాష 50000 పోయినా సరే మనకి డబ్బులు 2 కోట్లు అన్ని వస్తాయి కదా పైగా తిండి డబ్బులు కూడా ఆడే ఇస్తా అన్నాడు కదా అని బ్యాంకు నెంబర్ కనుక్కొని బ్యాంకులో వేద్దాం అనుకుంటున్నారు. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ పూజ చేసుకుంటూ, దేవి త్వరగా కనబడేటట్టు చూడు దేవుడా అలాగే సత్యకి, ఆదిత్య కి మధ్య ఉన్న అబద్ధాలు తొలగిపోవాలి ఆదిత్య కి దేవి అంటే ప్రాణం. కన్న కూతుర్లా చూసుకుంటాడు.
కానీ సత్య ఆదిత్యను ఎందుకు అపార్థం చేసుకుంటుందో తెలీదు వాళ్ళు కలిసేటట్టు చూడు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ కుర్చీలో కూర్చుని ఉండగా భాగ్యమ్మ వెళ్లి మాధవ్ తో గట్టిగా అరుస్తూ, నిజం చెప్పు నేను దేవమ్మ కోసం ఊరంతా ప్రతి సందు వెతికాను ఎక్కడా దొరకలేదు నీకు దేవమ్మ అంటే ఇష్టం అంటావు పచ్చ బొట్టు పెట్టుకున్నావు మరి ఇంత ధీమాగా ఉన్నావు నిజం చెప్పు దేవి ఎక్కడ? నా మనవరాలు ఎక్కడా? అని అనగా, నీకు నామీద నమ్మకం లేనట్టున్నది నిజంగా దీనికి నాకు ఏ సంబంధం లేదు అని మాధవ్ చిరాగ్గా అంటాడు.
అప్పుడు భాగ్యమ్మ, ఇందులోని హస్తము ఉందని నాకు తెలియాలి అప్పుడు చెప్తాను నా కొడకా నీ పని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య రుక్మిణి అనాధాశ్రమాలన్నీ వెతుక్కుంటూ ఉంటారు. అనాధాశ్రమాలు ఎందుకు వెతుకుతున్నావు పెనిమిటి అని రుక్మిణి అడగగా, తండ్రి ఉన్నా సరే నువ్వు దేవిని అనాధం చేసేసావు కదా పాపం ఈ గొడవలన్నీ భరించలేక తను అనాధ శరణాలయానికి వెళ్ళిందేమో నాకు భయమేస్తుంది అయినా నువ్వు వెళ్లిన దానివి వెళ్లకుండా దేవిని కూడా ఎందుకు తీసుకువెళ్లావు.
ఇంతలో అనాదాశ్రమం లో ఒకతను దేవి ఫోటో చూసి నేను ఈ పాప ని నిన్న రాత్రి ఎవరో కారులో ఎక్కించుకొని గూడెం వైపు తీసుకొని వెళ్తుండగా చూసాను అని అనగా వాళ్ళు ఆశ్చర్యపోయి, గూడెం వైపు తీసుకెళ్లడం ఏంటి మీరు అక్కడే ఉన్నారు కదా ఏం చేస్తున్నారు అని అంటారు. దానికి అతను, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ నుంచి గూడెం 10 15 కిలోమీటర్లు ఉంటది అని అంటారు. ఆ తర్వాత సీన్లో సూరి, దేవుడమ్మ, వాళ్ళ భర్త ముగ్గురు కూర్చుని ఉంటారు.
అప్పుడు దేవుడమ్మ, ఇలా మాట్లాడుకోవడం కాకుండా వెళ్లి ఆదిత్య కి సహాయం చేయొచ్చు కదా అని అనగా, ఆదిత్య బాబు అంతలా తిరుగుతున్నాడు మాధవ్ ఎందుకు ఏం మాట్లాడకుండా ఇంట్లో ఉన్నాడు అని అంటాడు సూరి. అప్పుడు దేవుడమ్మ మాధవ్ కి ఫోన్ చేసి మాధవ్ ఏం చేస్తున్నావు నీ కూతురు కనిపించడం లేదు అంటే నువ్వు అంత ధీమాగా ఎలా ఉండగలుగుతున్నావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదట కదా అని దేవుడమ్మ అంటుంది. ఆదిత్య ఇచ్చాడట కదా అని మాధవ్ అనగా ఆదిత్యకి దేవి అంటే ఇష్టం కనుక ఇచ్చాడు.
ఆ తర్వాత సీన్లో మాధవ్, రాధ రాదేంటి, ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అని అనుకోని,ఆదిత్య దగ్గరికే వెళ్ళింది అని అనుకుంటాడు. అప్పుడు ఆదిత్య కి ఫోన్ చేయగా ఆదిత్య ఎత్తడు. అప్పుడు మాధవ్ రోజు రోజుకి రాద ఆదిత్య కి దగ్గర అయిపోతుంది అని అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో దేవి స్కూల్లో కూర్చొని జరిగిన విషయం అంత ఆలోచించుకుంటూ ఉంటుంది.ఇంతలో టీచర్ అక్కడికి వచ్చి హోమ్ వర్క్ చేసావా అని అనగా దేవి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈమధ్య ఏమైంది దేవి నువ్వు దేనికి సమాధానం ఇవ్వటం లేదు, క్లాసులో సరిగా పాఠాలు వినడం లేదు, దిక్కులు చూస్తూ ఉంటున్నావు.
నువ్వు తన కన్న తండ్రివి కదా జాగ్రత్తగా చూడు వెతుకు ఇంక నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ, రామ్ మూర్తి,చిన్మయి ముగ్గురు దేవితో వాళ్ళు గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు చిన్మయి రుక్మిణి కి ఫోన్ చేసి ఏమైందమ్మా ఏమైనా తెలిసిందా అని అడగగా ఎవరో దేవమ్మని గూడెం వైపు వెళ్తున్నప్పుడు చూశారట మేము అక్కడికే వెళ్తున్నాము అని రుక్మిణి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!