- Home
- Entertainment
- Karthika Deepam: సౌందర్య గుండెల్లో దడ పుట్టిస్తున్న వంటలక్క.. కార్తీక్ ను ఒక ఆట ఆడుకుంటున్న మోనిత?
Karthika Deepam: సౌందర్య గుండెల్లో దడ పుట్టిస్తున్న వంటలక్క.. కార్తీక్ ను ఒక ఆట ఆడుకుంటున్న మోనిత?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

మోనిత (Monitha) అసలు నిజం చెప్పటంతో ఆదిత్య కోపంతో రగిలిపోతూ తన అన్నయ్య కార్తీక్ ను గట్టిగా నిలదీయాలని అనుకుంటాడు. ఇక కార్తీక్ తాను తప్పు చేయలేదని చాలా బాధను అనుభవిస్తున్నాని పగవాళ్ళకు కూడా ఇంత కష్టం రావద్దని ఆదిత్యతో (Aditya) అంటాడు.
ఇక తాను మోనిత (Monitha) ఇంటికి వెళ్లిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పద్దని కార్తీక్ ఆదిత్యతో అంటాడు. అంతేకాకుండా దీప (Deepa) గుడిలో తాము చేసిన పూజ చూసిందన్న విషయాన్ని కూడా చెప్పడంతో ఆదిత్య షాక్ అవుతాడు. ఏమి చేసేది లేక బాధపడుతుంటాడు.
మరోవైపు మోనిత ఆదిత్యతో మాట్లాడిన మాటలను తలుచుకొని మురిసిపోతుంది. ఇక ఆదిత్యకు కోపం ఎక్కువ అని సౌందర్య పై (Soundarya), కార్తీక్ (Karthik) పై అరుస్తూ ఉంటాడు అని అనుకుంటుంది. ప్రియమణిని పిలిచి తనతో కాసేపు మాటల యుద్ధం చేస్తుంది.
మోనిత (Monitha) మాటలను పడుతున్న ప్రియమణి (Priyamani) బాధపడుతూ తన మనసులో ఈ ఇంట్లో ఎందుకు ఉన్నానో అని బయటికి వెళ్ళలేను అంటూ.. ఉంటే మాత్రం మాటలు పడక తప్పదు అని అనుకుంటుంది. ఏనాటి బంధమో అని అనుకోని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక ఇంట్లో పండగ సందర్భంగా కార్తీక్ (Karthik) దీప కోసం చీరలు తెచ్చానన్న విషయాన్ని సౌందర్య తో చెబుతాడు. సౌందర్య మాత్రం దీప కోసం బాధపడుతూ కార్తీక్ తో కాసేపు మాట్లాడుతుంది. కార్తీక్ కూడా దీప (Deepa) గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
ఆదిత్య (Adithya) ఇంట్లో ఒంటరిగా నిల్చొని మోనిత మాట్లాడిన మాటలను, కార్తీక్ (Karthik) మాట్లాడిన మాటలను తలుచుకుంటాడు. మమ్మీ, అన్నయ్య ఈ విషయం ఎందుకు చెప్పలేదని అనుకుంటాడు. చెబితే నా కోపం ఇంకా ఎక్కువగా చూపిస్తానన్న ఉద్దేశంతో చెప్పలేదేమోనని అర్థం చేసుకుంటాడు.
అంతలోనే అక్కడికి శ్రావ్య (Sravya) వచ్చి ఆదిత్య (Adithya) ను చూసి ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. ఇక ఆదిత్య ఆ విషయాలను తలుచుకుంటూ శ్రావ్య కు చెబితే బాధపడుతుందని అనుకుంటాడు. ఎవరికీ చెప్పకూడదు అని తనలో తాను కుమిలిపోతాడు.
పండగ కోసం దీప (Deepa) పిండివంటలు చేస్తుంది. కార్తీక్ మాట్లాడిన మాటలను తలుచుకొని బాధ పడుతుంది. అంతలోనే సౌందర్య, కార్తీక్ (Karthik) దీపని చూసి బాధపడుతుంటారు. సౌందర్య దీప దగ్గరికి మాట్లాడుతుంది.
కానీ దీప (Deepa) మాత్రం తన మాటలతో, తన ప్రశ్నలతో సౌందర్య గుండెల్లో దడ పుట్టిస్తోంది. దీప మాటలకు సౌందర్య (Soundarya) తన మనసులో ఇంత భయం పెట్టిస్తుంది ఏంటి అని అనుకుంటుంది. దీప కూడా కాస్త వెటకారంగా నవ్వుతూ మాట్లాడేసరికి సౌందర్య నిజం తెలిసింది ఏమో అని అనుకుంటుంది.
తరువాయి భాగం లో మోనిత (Monitha) కార్తీక్ కు ఫోన్ చేసి తనను కలవమని అంటుంది. కార్తీక్ మాత్రం కలవనని మొండికేసేసరికి మోనిత తానే వస్తానని అనడంతో కార్తీక్ బయలుదేరుతుంటాడు. అప్పుడే దీప (Deepa) మాట్లాడాలని కార్తీక్ దగ్గరికి వస్తుంది. మొత్తానికి మోనిత కార్తీక్ తో ఆడుకుంటుంది.