MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదితిరావు ఏంటి ఇలా అయ్యిపోయింది..ప్లాస్టిక్ సర్జరీ తర్వాత షాకింగ్ లుక్?

అదితిరావు ఏంటి ఇలా అయ్యిపోయింది..ప్లాస్టిక్ సర్జరీ తర్వాత షాకింగ్ లుక్?

 గతంలో అదితిరావు ఉన్న ఫొటోలును, ఇప్పటి ఆమె ఫొటోలను ప్రక్క ప్రక్కనే పెట్టి షేర్ చేస్తున్నారు. ఇంతలా ట్రాన్సఫార్మ్ అయ్యిందేంటని 

4 Min read
Surya Prakash
Published : May 30 2024, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Aditi Rao Hydari

Aditi Rao Hydari


సినిమా హీరోయిన్స్ కు నటన కన్నా కూడా అందమే పెట్టుబడి. ఆ విషయం వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు అందంగా క‌నిపించేందుకు సినీతార‌లు కృత్రిమ ప‌ద్ధ‌తుల‌ను ఫాలో అవుతూంటారు. అదేమీ కొత్తేమీ కాదు.  తాము మ‌రింత అందంగా క‌నిపించాల‌ని కొంద‌రు ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకుంటే.. ఇంకొందరు పెదాల‌కు ఆప‌రేష‌న్లు చేయించుకుంటారు. బాలీవుడ్‌లో ఎక్కువ‌గా ఉండే ఈ ట్రెండ్‌ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతుంది. ఇప్ప‌టికే చాలామంది స్టార్లు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి అదితిరావు హైదరీ చేరిందని అంటున్నారు. 

212
Asianet Image


ఈ నటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఇంతలా మారిపోయిందేంటిని ఆశ్చర్యపోతున్నారు. గతంలో అదితిరావు ఉన్న ఫొటోలును, ఇప్పటి ఆమె ఫొటోలను ప్రక్క ప్రక్కనే పెట్టి షేర్ చేస్తున్నారు. ఇంతలా ట్రాన్సఫార్మ్ అయ్యిందేంటని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె మేకప్ చేసుకుంది అంటే అబ్బే అదేం లేదు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అంటున్నారు. 
 

312
Asianet Image

కొందరు నెట్ జన్లు మాట్లాడుతూ ... ఆమె ముక్కు చూడండి.. అలాగే కళ్లు కలర్, మొహం స్లిమ్ అయ్యింది. అయితే ఎన్ని మారినా ఆమె ముక్కు మాత్రం మారలేదు అంటున్నారు. ఇదంతా ఆమె ఆహారంలో చేసిన మార్పు వలన కాదు. కొన్ని సర్జరీలు, ఫిల్లర్స్, న్యూ ఏజ్ ఫేసియల్ రీ కనస్ట్రక్షన్ జాబ్స్ వల్ల వచ్చిన మార్పు ఇది అంటున్నారు. 

412
Asianet Image


అదితిరావు ఫొటోలు ఓ ప్లాస్టిక్ సర్జన్ చూసి కామెంట్ చేస్తూ... నేను ఓ సర్జన్ ని , నాకు ఇప్పటికీ అర్దం కాదు సెలబ్రెటీలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ విషయం చెప్పటానికి ఎందుకో ఇష్టపడరు. అందులో తప్పేముందో తెలియదు. పబ్లిక్ గా చెప్తే మరింత మందికి ఈ ప్లాస్టిక్ సర్జన్ గురించి తెలిసే అవకాసం ఉంటుందని చెప్తున్నారు. 
 

512
Asianet Image


ఇక సెలబ్రెటీలలో  చాలామంది స‌ర్జ‌రీలు స‌క్సెస్ అయ్యాయి. అయితే కొంత‌మందికి ఈ స‌ర్జ‌రీలు విక‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.  అయితే అదితిరావు అసలు రూపం అయితే కనుమరుగు అయ్యిపోయి కొత్త రూపు వచ్చింది. దాంతో ఆమెకు చేసిన ఈ సర్జరీ సక్సెస్ అయ్యినట్లా లేక ఫెయిలైనట్లా అనేది క్వచ్చిన్ మార్కే అంటోంది బాలీవుడ్ మీడియా. 

612
Asianet Image


 అదితిరావు హైదరీకి తెలుగులోనే కాకుండా హిందీలో  కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి అనే భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ లో అదితి రావు హైదరీ   మెరిసింది. ఒక వేశ్య పాత్రలో అదితిరావు హైదరీ అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా అదితికి మంచి గుర్తింపు లభించింది. 

712
Asianet Image


ఈ వెబ్ సిరీస్ పై తన కాబోయే భర్త హీరో సిద్ధార్థ్ కూడా మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. హీరామండి వెబ్ సిరీస్ ఒక ప్రేమకథలా ఉందని చెప్పుకొచ్చాడు. సంగీతం, నృత్యం, దృశ్యాలు అన్నీ మెప్పిస్తాయని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ హీరామండి వెబ్ సిరీస్ వైరల్ గా మారింది.  హీరామండి వెబ్ సిరీస్ లో మాత్రం అదితిరావు హైదరీ పాత్రకు మంచి అప్లాజ్ లభిస్తోంది. ఎంతో బాగా నటించి మెప్పించింది అంటున్నారు.

812
Asianet Image

ఈ నేపథ్యంలో తాజాగా అదితిరావు హైదరీ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఒక దారుణమైన సంఘటనను పంచుకుంది. తనకు ఒక సినిమాలో కీలక పాత్రకు ఆఫర్ వచ్చిందని చెప్పింది. అయితే సినిమా విడుదలైన తర్వాత తన పాత్ర కనీసం గెస్ట్ రోల్ అంత నిడివి కూడా లేదని చెప్పుకొచ్చింది. ఆ మూవీ మరేదో కాదు.. రణబీర్ కపూర్ హీరోగా చేసిన రాక్ స్టార్ చిత్రం.

912
Asianet Image

 “రాక్ స్టార్ చిత్రంలో నన్ను ఒక కీలక పాత్రకు తీసుకున్నారు. షూటింగ్ కూడా పూర్తైంది. నా క్యారెక్టర్ అటు ఇటూగా ఒక 20 నిమిషాలు వస్తుంది అనుకున్నాను. కానీ అవుట్ పుట్ లో నా పాత్ర కనీసం ఒక అతిథి పాత్ర అంత నిడివి కూడా లేదు. నిజానికి నాకు గుర్తింపు ఎప్పుడో వచ్చేది. కానీ, వాళ్లు చేసిన పనికి అలా అయిపోయింది” అంటూ అదితిరావు హైదరీ తన మనసులో ఉన్న బాధను ప్రేక్షకులతో పంచుకుంది. 

1012
Asianet Image


గత కొంతకాలంగా హీరోయిన్ అదితిరావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి డేటింగ్ చేయడం, తరుచు ఎక్కడబడితే చెట్టపట్టలేసుకుంటూ తిరిగేవారు. కాగా, ఈ మధ్యనే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తన ప్రేమ గురించి కొన్ని ఆసపక్తికర కామెంట్స్ చేసింది. అలాగే హీరో సిద్ధార్థ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం పై కూడా స్పందించింది. 

1112
Asianet Image


ఈ సందర్భంగా అదితిరావ్ హైదరీ మాట్లాడుతూ..నేను కొన్ని విషయాల్లో చాలా పవిత్రంగా నమ్ముతాను. ఇక మా ఇద్దరి రిలేషన్‌పై వచ్చిన రూమర్స్ కూడా సహజమే. కానీ, మేము మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం.ఇక వారు మా కంటే చాలా ప్రైవేట్ గా ఉంటారు. అయితే మా రిలేషన్స్ పై వస్తున్న రూమర్స్ కు మాకు చాలా కాల్స్ వచ్చేవి. అందుకే మేము మా రిలేషన్ ను బయటకు చెప్పేశాం. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం అని తెలిపింది.
 

1212
Asianet Image

అంతేకాకుండా.. నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. ముఖ్యంగా నా గోప్యతను నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. దానినే ఎక్కువగా నమ్ముతా. అలాగే   నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. ఇక మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని’ తెలిపింది.  
 

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved