- Home
- Entertainment
- Aditi Rao Hydari: వరుణ్ తేజ్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో సిద్దార్థ్.. కంఫర్మ్ చేసినట్లేగా ?
Aditi Rao Hydari: వరుణ్ తేజ్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో సిద్దార్థ్.. కంఫర్మ్ చేసినట్లేగా ?
అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తాను నిరూపించుకుంటోంది.

అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తాను నిరూపించుకుంటోంది. అదితి చివరగా మహాసముద్రం అనే క్రేజీ మూవీలో నటించింది. ఈ చిత్రంలో అదితి రావు.. హీరో సిద్దార్థ్ కి జంటగా నటించడం విశేషం.
గత ఏడాది విడుదలైన మహా సముద్రం తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ హాట్ బ్యూటీ సిద్ధార్థ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మహా సముద్రం చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమ పక్షులుగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ జంటగా ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాకి చిక్కారు.
అదితి రావుకి ఆల్రెడీ పెళ్ళై 2013లో బ్రేకప్ జరిగింది. సిద్దార్థ్ కూడా తన భార్య నుంచి విడిపోయి సింగిల్ గా ఉన్నాడు. దీనితో వీరి మధ్య కొత్త ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
తాజాగా ముంబైలో ఓ సెలూన్ వద్ద వీరిద్దరూ జంటగా కనిపించడంతో దాదాపుగా తమ రిలేషన్ ని వీరు అఫీషియల్ చేసినట్లు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అదితి బ్లాక్ డ్రెస్ లో గాగుల్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తోంది.
అయితే వీరిద్దరూ కెమెరాకి జంటగా ఫోజులు ఇచ్చేందుకు నిరాకారించినట్లు తెలుస్తోంది. ముందుగా అదితి సెలూన్ నుంచి వచ్చి కారు ఎక్కింది. ఆ తర్వాత సిద్దార్థ్ అదే కారులో ఎక్కాడు.
అదితి రావు తెలుగులో వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం అనే చిత్రంలో నటించింది. ఆ మూవీలో అదితి నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సమ్మోహనం, వి లాంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇక సిద్దార్థ్ అప్పుడప్పుడూ మాత్రమే నటిస్తున్నాడు. తన కెరీర్ కి తిరిగి బూస్ట్ ఇస్తుందన్న మహాసముద్రం అతడి ఆశలు నిరాశ చేసింది.