Devatha: ఆదిత్య ముందే దేవిని తీసుకెళ్లిన మాధవ.. సత్య ముందు నోరు జారిన ఆదిత్య?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో మాధవ(madhava) దేవిపై లేనిపోని దొంగ ప్రేమలో కురిపిస్తూ ముందు నటిస్తూ ఉంటాడు. సత్య మాధవ మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి దేవి ఆ మాటలు వింటూ బాధపడుతుంది. అప్పుడు మాధవ దేవి గురించి బాధపడుతూ ఉండగా అప్పుడు సత్య(sathya) మీరు ఇంతలా బాధపడుతున్నారు అని నాకు తెలియదు అనడంతో తండ్రిని కదా అంటూ మళ్ళీ నాటకాలు మొదలు పెడతాడు మాధవ.
మాధవ(madhava)మాటలు నిజం అని నమ్మిన సత్య బాధపడుతుంది. అప్పుడు మాధవ సత్య ద్వారా బిడ్డను తన ఇంటికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ మాటలు ఏదైనా దేవి బయటకు వెళ్లి ఆలోచిస్తు నిలబడగా ఇంతలోనే అక్కడికి ఆదిత్య వస్తాడు. అప్పుడు ఏమయింది అని అడగగా ఇంతలోనే సత్య అక్కడికి వచ్చి దేవి(dev నీ వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అనగా అప్పుడు ఆదిత్య కాంపిటీషన్ అయిపోయాక వెళ్తుంది అనడంతో వద్దు పండగపూట పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా అని అంటూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వస్తుంది.
అప్పుడు ఏంటి సత్య అని అడగగా దేవిని వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అనడంతో దేవుడమ్మ వద్దు అని అంటుంది. అప్పుడు సత్య మాటలకు దేవుడమ్మ ఆదిత్య ఆలోచనలో పడతారు. వీరి మాటలు దూరం నుంచి రాధ వింటూ ఉంటుంది. అప్పుడు వారి మాటలకు దేవి నేను కూడా వెళ్తాను అని అనడంతో దూరం నుంచి వింటున్న మాధవ సంతోషిస్తాడు. అప్పుడు దేవి, మాధవతో కలిసి వెళ్తూ ఉండగా అది చూసి ఆదిత్య బాధపడుతూ ఉంటాడు.
మరొకవైపు రాధ అమ్మవారి దగ్గరికి వెళ్లి దేవి ఆదిత్య(adithya) ల గురించి చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే భాగ్యమ్మ అక్కడికి వచ్చి రాధ పరిస్థితి తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య ఇంట్లో ఒంటరిగా కూర్చుని దేవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సత్య(sathya)వచ్చి ఆదిత్యను దేవి విషయంలో ప్రశ్నిస్తూ ఉంటుంది.
అప్పుడు దేవి,మాధవ (madhava)బిడ్డ అన్నట్టుగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఆదిత్య ఆవేశంగా దేవి నా బిడ్డ అని చెప్పి ఆ తర్వాత అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. మరొకవైపు రాధా ఒంటరిగా కూర్చొని గుడిలో జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మాధవ వచ్చి మీరు మాట్లాడుకునే మాటలు అన్నీ విన్నాను. నువ్వు దేవి (devi)నన్ను విడిచి వెళ్తారు అన్నప్పుడు నేను ఇలాంటి చేయడంలో తప్పులేదు.
నువ్వు నా నుంచి దేవిని దూరం చేయాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ మాటలు అన్ని విన్నాను అనడంతో రాధ(radha).షాక్ అవుతుంది. అప్పుడు మాధవ స్వార్థంతో మాట్లాడడంతో రాధ మాధవ పై సీరియస్ అవుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా కూడా ఆఫీసర్ సార్ దేవికి నాన్న అన్న విషయాన్ని చెప్పేస్తాను అని అంటుంది రాధ. మరుసటి రోజు ఉదయం పిల్లలు వచ్చి మాధవ(madhava)ని చెస్ ఆడుదాం అని పిలవగా నాకు పని ఉంది వెళ్లి ఆడుకోండి అని చెబుతాడు. ఇంతలోనే రాధ అక్కడికి వస్తుంది. అప్పుడు అందరూ చెప్పడంతో మాధవ దేవితో చెస్ ఆడడానికి ఓకే అని అంటాడు.