Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేదపై ప్రేమ చూపిస్తున్న ఆదిత్య.. కొడుకు మనసులో విషం నింపుతున్న మాళవిక?

Ennenno Janmala Bandham: వేదపై ప్రేమ చూపిస్తున్న ఆదిత్య.. కొడుకు మనసులో విషం నింపుతున్న మాళవిక?

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. మోసపోయి నడిరోడ్డు మీద పడ్డా తన బుద్ధి మార్చుకోని ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

Navya Reddy | Published : Jun 01 2023, 11:45 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

ఎపిసోడ్ ప్రారంభంలో బాధపడుతున్న కొడుకు దగ్గరికి వచ్చి ఏంట్రా ఇదంతా అంటూ మాలిని కూడా బాధపడుతుంది. చూడమ్మా.. ఎలా చేసిందో నా కొడుకుని చెత్త కుప్ప దగ్గర చూసి నా గుండె పగిలిపోయింది. ఆరోజు నా జీవితంతో ఆడుకుంది ఈరోజు నా కొడుకు జీవితంతో ఆడుకుంటుంది. అలాంటి మనిషికి ఈ ఇంట్లో సేవలు జరుగుతున్నాయి ఇదంతా మన ఖర్మ అంటాడు యష్.
 

28
Asianet Image

అలా అనకు తనని ఆ పరిస్థితుల్లో వదిలేయగలమా.. నాకు మాళవిక మీద పీకల వరకు కోపం ఉంది అయినా తనని ఎందుకు రానిచ్చాను.. నా మనవడి మనసు ఎక్కడ బాధపడుతుందో అని అంతేగాని ఆ మాళవిక మీద ప్రేమతో కాదు. అసలు ఏం జరిగిందో ఆదిత్యని అడుగుదాము అంటుంది మాలిని. ఆ తర్వాత వేద ఆదిత్య కి భోజనం పెడుతూ అసలు విషయం కనుక్కుంటుంది. అభి డాడి మరో పెళ్లి చేసుకుని మమ్మీని బయటికి గెంటేసాడు.
 

38
Asianet Image

అదేంటని అడిగితే నన్ను కూడా బయటికి గెంటేసాడు చూడు నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని తనకి తగిలిన దెబ్బని చూపిస్తాడు ఆదిత్య. కోపంతో రగిలిపోతాడు యష్. అయ్యో గమనించనే లేదు అంటూ ఆదిత్య కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది వేద. నా కొడుకు మీదే చేయి చేసుకుంటాడా వాడు హెల్త్ చూస్తాను అనుకుంటూ కోపంగా అభి దగ్గరికి బయలుదేరుతాడు యష్. భర్త వెనకే వేద కూడా బయలుదేరుతుంది. అదే సమయంలో డ్రింక్ చేస్తూ ఉంటారు అభి దంపతులు.

48
Asianet Image

మాళవిక వల్ల మనకి ఏమీ ప్రాబ్లం లేదు కదా అంటుంది నీలాంబరి. తనని ఏమైనా చేస్తే అడిగే దిక్కులేదు తనని ఎవరూ పట్టించుకోరు అంటాడు అభి. సడన్ గా అక్కడికి వచ్చిన యష్ అభిని చితక్కొడతాడు. నా భర్తని ఎందుకలా కొడుతున్నారు అంటూ నీలాంబరి నిలదీస్తుంది. నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి వాడెవడు అయినా వాడు ఎంత వెదవ నీకు తెలుసా వాడి జీవితంలోకి నువ్వు ఎలా వచ్చావు అంటాడు యష్.
 

58
Asianet Image

వాడు ఎలాంటి వాడో నాకు అనవసరం కానీ అతను నా భర్త అంటుంది నీలాంబరి. నువ్వు అసలు ఆడదానివేనా వాడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నాడు తెలుసా అలాంటి వాడిని వెనకేసుకొస్తావేంటి అంటుంది వేద. తను కూడా అలాంటిదే అయి ఉంటుంది అందుకే వాడిని వెనకేసుకొస్తుంది అంటూ నీలాంబరిని బ్లెయిమ్ చేస్తూ మాట్లాడుతాడు యష్. తనని వెనకేసుకొస్తున్న భార్యని మెచ్చుకుంటాడు అభి.
 

68
Asianet Image

నిమిషాల మీద తనని జైల్లో నుంచి బయటకు తీసుకువచ్చాను అంత బ్యాక్ గ్రౌండ్ ఉంది నాకు అలాంటిది నా భర్తని ఏమైనా అంటే చూస్తూ ఊరుకోను  అంటూ యష్ కి  వార్నింగ్ ఇస్తుంది నీలాంబరి. అదే సమయంలో అభి మాళవిక క్యారెక్టర్ ని తప్పుబడతాడు. వేద కోపంతో అభి మీద చెయ్యి ఎత్తుతుంది. వదిలేయ్ వేద వాడు ఇంక మారడు  అంటూ భార్యని తనతో తీసుకు వెళ్ళిపోతాడు యష్.
 

78
Asianet Image

ఇంటికి తిరిగి వస్తూ దారిలో కారు ఆపి ఎందుకు నా లైఫ్ లోనే ఇలా జరుగుతుంది. ఆరోజు ఖుషి ని వదిలి వెళ్ళిపోయినప్పుడే ఆదిత్యను కూడా వదిలి వెళ్ళిపోవచ్చు కదా నా బిడ్డ, నా హక్కు అంటూ తీసుకువెళ్ళింది. తీసుకెళ్లి చెత్తకుప్ప మీద పెట్టింది అని బాధపడతాడు యష్. ఇలా జరుగుతుందని తను ఊహించి ఉండదు అంటుంది  వేద. లోకంలో పక్షులు పశువులు కూడా పిల్లల కోసం ఆలోచిస్తాయి అలాంటిది మనిషై ఉండి ఆ మాత్రం ఆలోచించదా.

88
Asianet Image

ఈరోజు తన వల్లే నా బిడ్డకి విలువ లేకుండా పోయింది అని బాధపడతాడు యష్. తరువాయి భాగంలో ఆదిత్య మన దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు యష్. వేద ఆంటీ చాలా మంచిది అంటాడు ఆదిత్య. మన బ్రతుకులు ఇలా కావడానికి కారణం వేద యే అంటుంది మాళవిక. మిమ్మల్ని ఆదిత్య ని కలిపే బాధ్యత నాది అని భర్తకి భరోసా ఇస్తుంది వేద.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories