MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: పడరాని పాట్లు పడుతున్న ఆదిత్య.. వేద దంపతులు చేసిన పనికి షాకైన మాలిని?

Ennenno Janmala Bandham: పడరాని పాట్లు పడుతున్న ఆదిత్య.. వేద దంపతులు చేసిన పనికి షాకైన మాలిని?

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. డబ్బు మీద ఆశతో భర్తని వదిలేసి మరో వ్యక్తి పంచన చేరి నడిరోడ్డు పాలైన ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Updated : May 30 2023, 11:45 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

ఎపిసోడ్ ప్రారంభంలో ఇదే మనం ఉండబోయే గది నువ్వు లోపలికి వెళ్ళు నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అంటాడు యష్. అదేంటి బిజినెస్ మీటింగ్ కదా బయట గార్డెన్లో జరుగుతుంది అనుకున్నాను కానీ రూమ్ తీసుకున్నారేంటి అయినా లోపల నాకు ఎవరూ తెలియదు. మీరు ఫోన్ మాట్లాడి రండి ఇద్దరం కలిసే వెళ్దాము అంటుంది వేద. లోపలికి వెళ్ళు నీకే తెలుస్తుంది అంటూ కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్.
 

28
Asianet Image

లోపలికి వెళ్ళిన వేద రూమ్ డెకరేషన్ అంతా చూసి విషయం అర్థం చేసుకుంటుంది. మనసులో మాట చెప్పలేక  ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు అన్నమాట. అందుకేనా ఆయన అంతలా తడబడింది అని మనసులో అనుకుంటుంది. మరోవైపు ఏడుస్తూ ఇంటి బయటకి వస్తాడు ఆదిత్య. మా అమ్మ ఎక్కడికి వెళ్లిందా మీకు తెలుసా అంటూ వాచ్మెన్ ని అడుగుతాడు. తెలీదు అంటాడు వాచ్మెన్. వాచ్మెన్ దగ్గర ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు ఆదిత్య.
 

38
Asianet Image

అప్పటికే బార్ లో నానా హడావిడి చేస్తూ ఉంటుంది మాళవిక. ఆమె ఫోన్ ని బార్ మేనేజర్ లిఫ్ట్ చేసి మీ మదర్ బార్ లో ఉన్నారు ఎవరినైనా పెద్దవాళ్లని తీసుకొని రా అంటూ అడ్రస్ చెప్తాడు. ఫోన్ పెట్టేసిన ఆదిత్య బార్ ఎక్కడ ఉందో వాచ్మెన్ ని అడిగి తెలుసుకుని అటువైపు పరిగెడతాడు. ఈ వయసులో ఈ పిల్లాడికి ఏంటి ఇంత ఖర్మ తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకి ఇదే అని బాధపడతాడు వాచ్మెన్. సీన్ కట్ చేస్తే యష్ కూడా రూమ్ లోకి వస్తాడు.
 

48
Asianet Image

తడబడుతూ ఏదో చెప్పబోతాడు. యష్ ని హత్తుకొని ఐ యాం  ఇంప్రెస్డ్ అంటుంది వేద. యష్ చాలా ఆనందపడతాడు. మరోవైపు మాళవిక నాకు ఎవరూ లేరు నన్ను మోసం చేశాడు నేను చేస్తాను అంటూ బార్ లో చాలా డిస్టబెన్స్ చేస్తూ ఉంటుంది. స్టాఫ్ ఎంత వారించినా  వినిపించుకునే స్థితిలో ఉండదు మాళవిక. అప్పుడే వచ్చిన ఆదిత్య తనని అలా చూసి ఏడుస్తాడు.
 

58
Asianet Image

మమ్మీ పదా ఇంటికి వెళదాము ఇక్కడ అందరూ మనల్నే చూస్తున్నారు అంటూ తల్లిని బ్రతిమాలతాడు. మనకి ఇల్లు వాకిలి లేదు ఎక్కడికని వెళ్తాము అంటూ ఏడుస్తుంది మాళవిక. పెద్దవాళ్ళు ఎవరిని తీసుకురాలేదా నువ్వు తీసుకువెళ్ళలేవు అంటాడు మేనేజర్. వాళ్ళు ఎవరూ రారు అని చెప్పి బలవంతంగా మాళవిక ని అక్కడ నుంచి తీసుకొని  వెళ్తాడు ఆదిత్య. ఆటోని పిలిచి ఎక్కమంటాడు కానీ ఎక్కే పరిస్థితుల్లో ఉండదు మాళవిక.
 

68
Asianet Image

తూలిపోతూ నాకు ఎవరూ లేరు నన్ను ఇలా వదిలేయ్ నేను మోసపోయాను అంటూ ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది. మరోవైపు రూంలో ముందే చెప్పొచ్చు కదా ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు అంటుంది వేద. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంది అంటాడు  యష్. మరోవైపు నడుస్తూ చెత్తకుప్పలో పడిపోతుంది మాళవిక. ఏడుస్తూ నేను రావాల్సిన ప్లేస్ కే వచ్చాను. నా స్థానం ఇదే అందరూ నన్ను వదిలేశారు అంటూ ఏడుస్తుంది.

78
Asianet Image

ఇప్పుడు ఏమైందమ్మా నీకోసం నేను ఉన్నాను కదా నాన్న ఉన్నారు కదా నువ్వు ఏడవకు ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది పదా వెళ్దాం అంటాడు ఆదిత్య. ఎక్కడికి వెళ్తాము ఇల్లు లేదు వాకిలి లేదు అంటుంది మాళవిక. దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని తండ్రికి ఫోన్ చేస్తాడు ఆదిత్య. తరువాయి భాగంలో మాళవిక ని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అవుతారు వేద దంపతులు.

88
Asianet Image

ఆదిత్యని తనతో పాటు రమ్మంటాడు యష్. అమ్మ లేకుండా నేను రాను అంటాడు ఆదిత్య. మనతోపాటు అమ్మను కూడా తీసుకువెళ్తాము అంటుంది వేద. మాళవికని ఇంటికి తీసుకురావడం చూసి షాక్ అవుతుంది మాలిని. తనని ఎందుకు తీసుకువచ్చావు అంటూ యష్ మీద కోప్పడుతుంది.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories