Devatha: రుక్మిణి ఇంటికి తీసుకువెళ్లిన ఆదిత్య.. దేవుడమ్మ నిర్ణయం ఏంటి?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దేవుడమ్మ (Devudamma) ఆడపడుచు అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉండగా.. అవేమీ పట్టించుకోవద్దు అని తన ఫ్యామిలీ మొత్తం దేవుడమ్మ కు చెబుతారు. ఈలోపు హడావిడిగా ఆదిత్య (Adithya) ఇంటికి వస్తాడు. అక్కడి దేవి ని చూసి ఎంతో ఆనంద పడతాడు.
ఆ తర్వాత ఆదిత్య (Adithya) అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి అని ఆనందంగా ఉంటాడు. ఆ తర్వాత మనసులో మాటల్లో చెప్పడం కాదు. డైరెక్ట్ గా తీసుకొని వచ్చి చూపించాలి అనుకుంటాడు. మరోవైపు రుక్మిణి (Rukmini) ఇద్దరు పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది గమనించిన మాధవ మనిషి అనుకుంటే మాటలు కూడా తేడా వస్తున్నాయ్ అని అనుకుంటాడు.
ఆ క్రమంలో రుక్మిని (Rukmini) ని ఇద్దరు పిల్లలు కథ చెప్పమని అడుగుతారు. ఇక రుక్మిణి రామ రాముడు రావణాసురుడు కథను మాధవ ఎ విల్ ప్లాన్ లోకి కన్వర్ట్ చేసి.. మాధవ (Madhava) కి వినపడేలా చెబుతుంది. ఆ తర్వాత రుక్మిణి మాధవ గురించి డైరెక్ట్ గా నా పెనిమిటి తో చెప్పేస్తా అని నిర్ణయం తీసుకుంటుంది.
ఈలోపు రుక్మిణి (Rukmini) దగ్గరకు ఆదిత్య (Adithya) వచ్చి.. రా చెబుతాను అని తన చేయి పట్టుకొని తీసుకొని వెళతాడు. ఎవరు ఏమీ అనుకోరు మాట్లాడకుండా నాతో రా అని తనని కారులో ఎక్కిస్తాడు. ఇదేంటి కారులో నాన్న ఎక్కడికి తీసుకొని వెళుతున్నావు అని రాధ అడుగుతుంది. ఇక రాధ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది.
నేను ఇంటికి వెళతాను.. ఇప్పుడు ఇంటికి వెళ్ళక పోతే నాకు ఏమైందో అని పిల్లలు టెన్షన్ పడతారు అని రాధ (Radha) ఆదిత్య (Adithya) ను బ్రతిమిలాడు తుంది. ఆదిత్య నేరుగా తన ఇంటికి తీసుకుని వస్తాడు.. అది గమనించిన రుక్మిణి ఒక్కసారి గా స్టన్ అవుతుంది..ఇక రాధ ఇంట్లోకి రావడానికి భయపడుతూ ఉంటుంది.
ఇక ఆదిత్య (Adithya) మీ ఇంటికి నువ్వు రావడానికి ఎందుకు భయపడుతున్నావు అని ఇంట్లోకి తీసుకొని వెళతాడు. ఇక ఇంట్లో కి తీసుకెళ్ళి న ఆదిత్య దేవుడు దగ్గర కుంకుమ తీసుకుని రుక్మిణి (Rukmini) కి బొట్టు పెడతాడు. ఇక నీ ఇల్లు నీకు ఉంది. నిన్ను నీ కంటే ఎక్కువగా ప్రేమించే నీ వాళ్ళు నీకు ఉన్నారు అని అంటాడు.
ఇక ఆయన ఇంటికి నువ్వు రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావ్? అని అడుగుతాడు. దానికి రుక్మిని (Rukmini) నువ్వు సత్యాన్ని పెళ్లి చేసుకున్నావు.. ఇప్పుడు నేను వచ్చాను అని నువ్వు సత్యను వదిలేస్తావా అని ఏడ్చుకుంటూ అంటుంది. దాంతో ఆదిత్య (Adithya) కు ఏం చెప్పాలో అర్థంకాక స్టన్ అవుతాడు.