ఒకప్రక్క ఎఫైర్ రూమర్స్... ప్రభాస్ పై కృతి సనన్ ఆసక్తికర కామెంట్స్!
హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారనే పుకారు కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ పై కృతి సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చాలా కాలం తర్వాత కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రభాస్ కి జంటగా ఆమె నటించిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. మూవీపై అంచనాలు పెంచేసింది. టీజర్ ట్రోల్స్ కి గురి కాగా ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. కృతి సనన్, ప్రభాస్... రాఘవుడు, జానకి పాత్రల్లో అలరించనున్నారు.
మరోవైపు ప్రభాస్-కృతి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్స్ ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. త్వరలో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఆయన కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది.
కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ కి హీరో వరుణ్ ధావన్ కామెంట్స్ కూడా కారణమయ్యాయి.గత ఏడాది విడుదలైన బేడియా మూవీ ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ వ్యవహరించారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో చేస్తున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు.
Prabhas-Kriti Sanon
పరోక్షంగా ప్రభాస్ కృతి సనన్ ని ప్రేమిస్తున్నట్లు వరుణ్ కామెంట్స్ ఉన్నాయి. తాజాగా కృతి సనన్ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ ని కృతి పొగడ్తలతో ముంచెత్తారు. కృతి సనన్ మాట్లాడుతూ... ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరినీ గౌరవిస్తారు. మొదట్లో తక్కువ మాట్లాడేవారు. మనకు రాని భాషలో నటించడం చాలా కష్టం. ఆ విషయం నాకు తర్వాత అర్థమైందని ఆయనతో చెప్పాను. నేను మామూలుగా మాట్లాడేదాన్ని, ప్రభాస్ మాత్రం ఓపెన్ గా మాట్లాడేవాడు.
Prabhas-Kriti Sanon
ప్రభాస్ తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతారు. ఆయన కళ్ళతో భావాలు పలికించగలరు. ప్రభాస్ ని తప్ప మరొకరిని రాఘవ పాత్రలో ఊహించుకోలేను అని కృతి సనన్ అన్నారు. కృతి సనన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.