MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..

Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏం చదువకున్నాడో తెలుసా? ఆయన క్వాలిఫికేషన్ తెలిస్తే షాక్ అవుతారు. జక్కన్న చదువుకు సబంధించిన ఆయన భార్య రమారాజమౌళి వెల్లడించిన రహస్యాలు, వేసిన సెటైర్ల విషయానికి వస్తే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 12 2026, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు సినిమా రారాజు..
Image Credit : Asianet News

తెలుగు సినిమా రారాజు..

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మార్క్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు చిన్న చూపు చూసిన తెలుగు సినిమాను బాలీవుడ్ ను మించి నిలబెట్టాడు జక్కన్న. ఈపేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి పేరు మీదే వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరోకి పాన్ ఇండియా లెవెల్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో, అంతకు మించిన క్రేజ్ తో పాటు మార్కెట్ రాజమౌళికి సొంతం. అందుకే రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరో ఇమేజ్‌సైతం భారీగా పెరిగిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాజమౌళి ఏం చదువుకున్నారు?
Image Credit : our own

రాజమౌళి ఏం చదువుకున్నారు?

ప్రపంచ సినిమాతో శభాష్ అనిపింకుకున్న ఎస్.ఎస్. రాజమౌళి ఏం చదువుకున్నారు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? ఇంత మంది స్టార్స ను, హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా ఎలా నడిపించగలుగుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చదివారు అనే విషయంలో జక్కన్న సతీమణి రమా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇంతకీ రాజమౌళి ఏం చదువుకున్నారంటే? రాజమౌళి ప్రాథమిక విద్య కొవ్వూరులో సాగింది. ఆ తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివినట్టు సమాచారం.

చిన్నతనంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వేగంగా తరగతులు దాటుకుంటూ వచ్చిన ఆయనకు, ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి కష్టమైన పుస్తకాలను చూసి భయం కలిగింది. సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో చదువుపై ఆసక్తి తగ్గి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యారట. ఆ తర్వాత రెండేళ్ల విరామం (గ్యాప్) తీసుకొని, తిరిగి కొవ్వూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిట్టు తెలుస్తోంది. .

34
రమా రాజమౌళి చెప్పిన టాప్ సీక్రెట్..?
Image Credit : netflix

రమా రాజమౌళి చెప్పిన టాప్ సీక్రెట్..?

ఇంటర్మీడియట్ తర్వాత ఆయన ఎలాంటి ఉన్నత విద్య లేదా డిగ్రీ అభ్యసించలేదు. విద్యకు స్వస్తి చెప్పి, చదువుకంటే సినిమాలపై ఉన్న మక్కువతో ఫిల్మ్ ఎడిటింగ్, అసిస్టెంట్ డైరెక్షన్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా స్పందించారు. ఈ విషయంలో ఆమె తరచూ సరదాగా సెటైర్లు వేస్తుంటారు.

"ఆయన పెద్దగా చదువుకోలేదు.. కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివారు" కానీ సర్టిఫికెట్లు మాత్రం మేం ఎప్పుడూ చూడలేదు, మా ఫ్యామిలీలో ఎవరు పెద్దగా చదువుకోలేదు. రాజమౌళి మాత్రమే ఇంటర్ చదివాను అంటాడు. కానీ రాజమౌళి.. పుస్తకాలు బాగా చదువుతాడు, అది ఆయన నాలెడ్జ్ కు కారణం. చిన్నప్పటి నుంచి ‘అమర్ చిత్ర కథలు’, రామాయణ, మహాభారతాలు చదవడం ఆయనకు అలవాటు, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని పెంపొందించుకున్నారని'' రమా రాజమౌళి చెప్పారు.

44
డిగ్రీ లేకపోయినా..
Image Credit : SS rajamouli/insta

డిగ్రీ లేకపోయినా..

డిగ్రీ లేకపోయినా.. ఉన్నత చదువులు చదవకపోయినా.. రాజమౌళికి ఉన్న సృజనాత్మకత, కథనాన్ని నడిపించే నైపుణ్యం, సమాచారాన్ని సేకరించగలిగే మైండ్ డిగ్రీలు ఉన్నవారి కంటే ఎంతో గొప్పవని రమా రాజమౌళి అన్నారు. మామూలు మార్కులు, డిగ్రీ సర్టిఫికేట్లు మాత్రమే ఒకరి సామర్థ్యాన్ని భవిష్యత్తును నిర్ణయించవని రాజమౌళి జీవితం నిరూపిస్తుంది. నిరంతర శ్రమ, పట్టుదల, జక్కన్నను ఆ స్థానంలో నిలబెట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Rajamouli కోడలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? జగపతి బాబుతో బంధుత్వం ఎలాగంటే?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved