పెళ్లి ఒక బూతు, నాన్న వ్యతిరేకించాడు... వరలక్ష్మీ శరత్ కుమార్ హాట్ కామెంట్స్
తెలుగులో లేడీ విలన్ గా సెటిల్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చని ఆ విషయాన్ని బూతుతో పోల్చారు.

Varalakshmi Sarath kumar
క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాల్లో లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ పీక్స్ చూపించారు. లేడీ విలన్ పాత్రలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఏజెంట్, మైఖేల్ వంటి చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించారు.
Varalakshmi Sarath kumar
నటుడు శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మీ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓంకార్ హోస్ట్ గా సిక్స్త్ సెన్స్ షోకి వరలక్ష్మీ, బిందు మాధవి గెస్ట్స్ గా వచ్చారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఓంకార్ అడిగారు. ఇద్దరూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. వరలక్ష్మి క్రాస్ ఫింగర్స్ చూపించింది. దాని అర్థం ఏమిటంటే బూతు, పెళ్లి మేటర్ నా వద్దకు రావద్దు అంది.
Varalakshmi Sarath kumar
పెళ్లి అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలం. పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అని చెప్పుకొచ్చారు.
Varalakshmi Sarath kumar
బిందు మాధవి మాట్లాడుతూ.... ఈ టైం ఫ్రేమ్ లో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి మన మీద ఉండకూడదు. అది రాంగ్ రిలేషన్స్ కి దారి తీస్తుంది. నీ జీవితంలోకి పెళ్లి చేసుకోవాలి అనుకునే పర్సన్ ఇంకా రాలేదు. వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఒకప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఏమీ సాధించినట్లే అనుకునేవారు. ఇప్పుడు ఆ ధోరణి మారిందన్నారు.
Varalakshmi Sarath kumar
ఇక సినిమాల్లోకి రావడం, సక్సెస్ గురించి కూడా వరలక్ష్మీ మాట్లాడారు. నేను ఏం సాధించినా క్రెడిట్ మొత్తం నాదే. ఇంక ఎవరూ లేరు. మా నాన్న శరత్ కుమార్ నటి కావడాన్ని ఇష్టపడలేదు. అది ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మా అమ్మకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. కాబట్టి నా సక్సెస్ వెనుక ఉన్నది నేనే అన్నారు.
Varalakshmi Sarath kumar
ఒకప్పుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అనేవారు. ఇప్పుడు వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ అంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. కాగా గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ విశాల్ ని ప్రేమించారు. ఏళ్ళ తరబడి వీరి ప్రేమాయణం సాగింది. తర్వాత విభేదాలతో విడిపోయారు. అప్పటి నుండి వరలక్ష్మీ సింగిల్ గా ఉంటున్నారు.