MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నాతో తక్కువగా మాట్లాడే కృష్ణ వచ్చి బతిమాలినా ఒప్పుకోలేదు..కొడుక్కి విషం పెట్టాలి అని చెప్పగానే..

నాతో తక్కువగా మాట్లాడే కృష్ణ వచ్చి బతిమాలినా ఒప్పుకోలేదు..కొడుక్కి విషం పెట్టాలి అని చెప్పగానే..

ఇండస్ట్రీలో తన నటనని చాలా మంది మెచ్చుకున్నట్లు వాణిశ్రీ తెలిపింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ, ఏఎన్నార్ మాత్రం తనని ఎపుడూ మెచ్చుకోలేదని వాణిశ్రీ అన్నారు. ఎందుకు అని ప్రశ్నించగా వాళ్ళ సమస్య ఏంటో నాకు తెలియదు. కృష్ణ అయితే నాతో మాట్లాడడమే చాలా తక్కువ అని వాణి శ్రీ తెలిపింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2024, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కళాభినేత్రిగా, నటనలో లెజెండ్ గా ప్రశంసలు దక్కించుకున్న వాణిశ్రీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ.. గడుసరిగా నటించడం వాణిశ్రీకే చెల్లింది. వాణిశ్రీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలందరితో నటించింది. అదే విధంగా ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో తల్లి, అత్త తరహా పాత్రలు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఇండస్ట్రీలో తన నటనని చాలా మంది మెచ్చుకున్నట్లు వాణిశ్రీ తెలిపింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ, ఏఎన్నార్ మాత్రం తనని ఎపుడూ మెచ్చుకోలేదని వాణిశ్రీ అన్నారు. ఎందుకు అని ప్రశ్నించగా వాళ్ళ సమస్య ఏంటో నాకు తెలియదు. కృష్ణ అయితే నాతో మాట్లాడడమే చాలా తక్కువ అని వాణి శ్రీ తెలిపింది. 

36

సెట్స్ లో ఉన్నప్పుడు కూడా కృష్ణ నాతో సరిగ్గా మాట్లాడరు అని వాణిశ్రీ పేర్కొంది. అలాంటి కృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు బతిమాలినట్లు వాణిశ్రీ పేర్కొంది. విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయిగారు చిత్రాన్ని ముందుగా కృష్ణ చేయాలనుకున్నారట. వెంకటేష్ బొబ్బొలి రాజా చిత్రంలో నేను నటించాను. 

46

స్టార్ హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత అత్త పాత్రల్లో నటించడం నాకేమి ఇబ్బందిగా అనిపించలేదు అని తెలిపింది. అబ్బాయిగారు చిత్రం రీమేక్ మూవీ. ముందు కృష్ణ గారి దగ్గరికి ఆ చిత్రం వెళ్ళింది. కృష్ణ కి తల్లిగా వాణిశ్రీ నటిస్తే తాము నిర్మించటానికి ఒకే అని నిర్మాతలు అన్నారట. 

56

దీనితో కృష్ణ నాకు ఫోన్ చేశారు. వాణిశ్రీ ఈ సినిమా నువ్వు చేయాలి అని బతిమాలారు. ఆ కథపై కృష్ణకి అంత నమ్మకం ఉండేది. అది రీమేక్ సినిమా.. పైగా తల్లి పాత్ర. దీనితో నేను వెంటనే ఒప్పుకోకుండా.. ఆ మూవీ చూసి నా నిర్ణయం చెబుతా అని వాణిశ్రీ అన్నారట. తమిళంలో ఆ చిత్రం చూస్తే క్లైమాక్స్ లో తల్లే తన కొడుక్కి విషం పెట్టే సీన్లు ఉంటాయి. 

66

నేను వెంటనే ఈ మూవీ నేను చేయను అని చెప్పేసినట్లు వాణిశ్రీ అన్నారు. పెంచిన బిడ్డకే విషం పెట్టడం తనకి ఏమాత్రం నచ్చలేదని వాణిశ్రీ తెలిపింది. వాణిశ్రీ ఒప్పుకోకపోవడంతో ఆ చిత్రం కృష్ణ చేతుల్లో నుంచి వెంకటేష్ వద్దకు వెళ్ళింది. ఇక తల్లి పాత్రలో జయచిత్ర నటించారు. అదే విధంగా నచ్చకపోయినా కొన్ని చిత్రాలు చేశానని వాణిశ్రీ అన్నారు. బొంబాయి ప్రియుడు, వింతకథ లాంటి చిత్రాలు తనకి నచ్చలేదని తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved