- Home
- Entertainment
- పవిత్ర లోకేష్, ప్రగతిలని ఒక ప్రాపర్టీ లాగా వాడుకున్నారు..చిరంజీవితో మాత్రమే అలా చేయలేదు, నటి సుధ కామెంట్స్
పవిత్ర లోకేష్, ప్రగతిలని ఒక ప్రాపర్టీ లాగా వాడుకున్నారు..చిరంజీవితో మాత్రమే అలా చేయలేదు, నటి సుధ కామెంట్స్
ప్రముఖ నటి సుధ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందారు. తనకి కాంపిటీషన్ అయిన పవిత్ర లోకేష్, ప్రగతి లపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నటి సుధ అంటే టాలీవుడ్ లో ఆమె చేసిన తల్లి పాత్రలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రల్లో కూడా నటించారు. టాలీవుడ్ లో ఆమె సినీ ప్రయాణం తల్లిదండ్రులు చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆమెకి అవకాశం వచ్చింది. ఈ మూవీలో సుధ.. చిరంజీవి వదిన పాత్రలో నటించారు. ఈ చిత్రంతో సుధ జాతకం మారిపోయింది. గ్యాంగ్ లీడర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. రౌడీ అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్, హలో బ్రదర్, ఆమె, సుస్వాగతం, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, అతడు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ లో నటించారు. కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టుల రాకతో నటి సుధకి ఇటీవల అవకాశాలు కాస్త తగ్గాయి.
దీని గురించి సుధ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి, పవిత్ర లోకేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు వచ్చాక మీకు తల్లి పాత్రలో అవకాశాలు తగ్గాయి.. మిమ్మల్ని సైడ్ చేశారు అని అంటున్నారు నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సుధ స్పందిస్తూ.. అసలు నన్ను సైడ్ చేయడానికి వీళ్ళెవరు అని మండిపడ్డారు. నాకంటూ ఒక రికార్డ్ ఉంది ఇండస్ట్రీలో.. గర్వంగా చెప్పుకుంటున్నా.. పొగరనుకున్నా పర్వాలేదు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఇలా అగ్ర హీరోలతో ఎన్నో సినిమాలు చేశాను. అది నా రికార్డ్ లో ఉంది కదా. నేను నటించిన ఎన్నో చిత్రాలు 100 రోజులు ఆడాయి.
ఇలాంటి రికార్డ్ పవిత్ర లోకేష్ కి కానీ, ప్రగతికి కానీ ఉందా అని సుధ ప్రశ్నించారు. పవిత్ర లోకేష్, ప్రగతి చేసిన సినిమాలు చూడండి.. టేబుల్ మీద పెన్సిల్ ఉన్నట్లుగా.. వాళ్ళు కూడా సినిమాలో ఉంటారు అంతే. నటించడానికి ఎలాంటి స్కోప్ వాళ్ళకి లేదు. బహుశా వాళ్ళకి డబ్బులు లేక అలాంటి పాత్రలకు ఒప్పుకున్నారేమో నాకు తెలియదు. నాకు వాళ్ళు ఏమాత్రం సమానం కాదు.
నేను గ్యాంగ్ లీడర్ లో నటించా, ఆమె సినిమాలో నటించా, మన్మథుడులో చేశా.. చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించా. నాగార్జునతో ఏకంగా 17 సినిమాలు చేశా. వెళ్ళెవరైనా వాళ్ళతో కనీసం 4 సినిమాలు చేసి ఉంటారా ? అలాంటప్పుడు వాళ్ళు నాకు పోటీ ఎలా అవుతారు అని సుధ ప్రశ్నించారు. పవిత్ర లోకేష్, ప్రగతి లని చూస్తే నాకు జాలి వేస్తుంది. వాళ్ళని కేవలం ఒక ప్రాపర్టీ లాగా మాత్రమే వాడుకుంటున్నారు. నటించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళకి రావడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించాను అని అన్నారు. బాలకృష్ణ గారికి కూడా తల్లిగా నటించాను. కానీ చిరంజీవి గారికి మాత్రం తల్లిగా నటించలేదు. బహుశా ఆయనకి తల్లిగా నేను సూట్ కానని అనుకున్నారేమో. గ్యాంగ్ లీడర్ లో ఆయనకి వదినగా నటించాను కదా అని గుర్తు చేసుకున్నారు.