MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • 50 ఏళ్ల మహేష్ బాబు హీరోయిన్, 50 కోట్ల ఆస్తులు.. సిమ్రాన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?

50 ఏళ్ల మహేష్ బాబు హీరోయిన్, 50 కోట్ల ఆస్తులు.. సిమ్రాన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?

సీనియర్  నటి సిమ్రాన్  50వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా  సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో సిమ్రాన్  ఆస్తులు, సంపాదన  వివరాలు చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 04 2026, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌత్ లో నార్త్ హీరోయిన్ల హవా..
Image Credit : instagram/simran

సౌత్ లో నార్త్ హీరోయిన్ల హవా..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్థానిక హీరోయిన్ల కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ సక్సెస్ అయ్యారు. ఆ లిస్టులో సిమ్రాన్ పేరు కచ్చితంగా ఉంటుంది. 1976, ఏప్రిల్ 4న పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈమె అసలు పేరు రిషిబాల. సినిమాల కోసం తన పేరును 'సిమ్రాన్'గా మార్చుకుంది. అదే ఆమెకు గుర్తింపుగా మారింది. అభిమానులు ఆమెను ముద్దుగా ‘ఇడయళగి’ అని పిలుచుకునేవారు. ఆ బిరుదు ఇప్పటికీ ఏ నటికీ దక్కలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సిమ్రాన్ పరిచయం
Image Credit : instagram/simran

సిమ్రాన్ పరిచయం

హిందీ సినిమాల ద్వారా సినిమాల్లోకి వచ్చిన సిమ్రాన్, 1997లో తెలుగు, మలయాళం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా, త్వరగానే సౌత్ లో తనకంటూ  తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, విజయ్, సూర్య, అజిత్, కమల్ వంటి  స్టార్ హీరోలందరితోనూ నటించింది. 

చాలాకాలం పాటు ఆమె జతకట్టని ఏకైక హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. 'పేట' సినిమాతో ఆ కోరిక కూడా తీరింది. ఉత్తరాదిలో పెరిగినా, చీర, లంగా ఓణీ కడితే అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించేది. ఆ సహజమైన సౌత్ లుక్, ముక్కుపుడక మెరుపు, కళ్లలో కోపం, గుండెల్లో మాతృత్వం.. ఇవన్నీ సిమ్రాన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. గ్లామర్ రోల్ అయినా, హోమ్లీ పాత్ర అయినా.. రెండింటికీ సరిగ్గా సరిపోయే హీరోయిన్ సిమ్రాన్.

34
సిమ్రాన్ సినీ ప్రయాణం
Image Credit : instagram/simran

సిమ్రాన్ సినీ ప్రయాణం

 కథల ఎంపికలో సిమ్రాన్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. ప్రతి సినిమా ఒక కొత్త కోణం, ప్రతి పాత్ర ఒక కొత్త అనుభవం. చివరగా ఆమె నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాలో కూడా శ్రీలంక అమ్మాయిగా నటించిందనడం కన్నా జీవించిందనే చెప్పాలి. ఆ పాత్రకు అంతలా సరిపోయింది. 50 ఏళ్ల వయసులోనే సిమ్రాన్ క్రమశిక్షణ కలిగిన జీవన శైలీ.. ఆమెను ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. యోగా, జిమ్ తో పాటు.. ఆరోగ్యకరమైన అలవాట్ల వల్లన సిమ్రాన్.. ఇప్పటికీ స్లిమ్ గా మెరిసిపోతున్నారు. 

44
సిమ్రాన్ ఆస్తుల విలువ
Image Credit : simran insta

సిమ్రాన్ ఆస్తుల విలువ

పాటల్లో సిమ్రాన్ డ్యాన్స్ వేరే లెవల్లో ఉంటుంది. క్లాసికల్ నుంచి వెస్ట్రన్ వరకు, రొమాంటిక్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు.. అన్ని రకాల డ్యాన్స్‌లలో తనదైన ముద్ర వేసింది. కొన్ని పాటలు ఇప్పటికీ తెలుగు,తమిళ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. హీరోలకు గట్టి పోటీ ఇచ్చేంత గొప్ప డ్యాన్సర్ సిమ్రాన్.  50వ వసంతంలోకి అడుగు పెట్టిన సిమ్రాన్‌కు సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఒక నటి విజయం కేవలం సినిమాలతో కొలవలేం. ప్రేక్షకుల గుండెల్లో ఎన్ని సంవత్సరాలు బతికి ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో సిమ్రాన్ ఎప్పటికీ ముందుంటుంది. ఆమె ఆస్తి విలువ రూ.45 నుంచి 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చెన్నైలో ఆమెకు సొంతంగా ఒక రెస్టారెంట్ కూడా ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
సాయి పల్లవి సినిమాల జోరు.. 5 సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయబోతున్న రామాయణ్ సీత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved