3 ఏళ్లలో 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోయిన్.. టాలీవుడ్ లో ఈ రికార్డు ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు
టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన రికార్డులు నమోదవుతూ ఉంటాయి. కొన్ని బ్రేక్ చేయలేని రికార్డులు నమోదవుతుంటాయి. ఒక క్రేజీ హీరోయిన్ టాలీవుడ్ లో మరే ఇతర హీరోయిన్ కి సాధ్యం కాని రికార్డుని సెట్ చేసి పెట్టింది.

Simran Industry Hit Movies
Simran Industry Hit Movies: టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన రికార్డులు నమోదవుతూ ఉంటాయి. కొన్ని బ్రేక్ చేయలేని రికార్డులు నమోదవుతుంటాయి. ఉదాహరణకి చిరంజీవి టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్లు సాధించిన హీరో. ఆ రికార్డుని చెరిపివేయడం ఇప్పట్లో ఎవరి వల్లా కాదేమో. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక చిత్రం చేయడం కూడా గగనం అయిపోతోంది. ఆ విధంగా ఒక క్రేజీ హీరోయిన్ టాలీవుడ్ లో మరే ఇతర హీరోయిన్ కి సాధ్యం కాని రికార్డుని సెట్ చేసి పెట్టింది.
Actress Simran
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాణిగా వెలుగొందిన సిమ్రాన్. 90 దశకం ఎండింగ్ నుంచి తన హవా మొదలు పెట్టిన సిమ్రాన్ 2000 సంవత్సరం తర్వాత చెలరేగిపోయింది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్ అంటే ఎక్కువగా సిమ్రాన్ పేరే వినిపించేది. 1999 నుంచి 2001 వరకు ముడేళ్ళల్లో సిమ్రాన్ తెలుగులో 11 చిత్రాల్లో నటించింది. ఈ 11 చిత్రాల్లో స్టార్ హీరోలతోనే నటించింది. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లతోనే 8 చిత్రాల వరకు స్క్రీన్ షేర్ చేసుకుంది.
Simran, Balakrishna
మిగిలిన చిత్రాలు మహేష్ బాబు, నాగార్జునతో ఉన్నాయి. 1999 నుంచి సిమ్రాన్ ఏడాదికి ఒకటి చొప్పున మూడేళ్ళలో మూడు ఇండస్ట్రీ హిట్ చిత్రాలు సాధించింది. 1999లో బాలయ్యతో నటించిన సమరసింహారెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్ కాగా, 2000లో విక్టరీ వెంకటేష్ తో నటించిన కలిసుందాంరా చిత్ర అత్యధిక వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2001లో బాలయ్యతో మరోసారి సిమ్రాన్ నటించిన నరసింహనాయుడు కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్.
Simran, Venkatesh
టాలీవుడ్ లో ఇలాంటి రికార్డు సిమ్రాన్ కి తప్ప ఇంకెవరికీ లేదు. భవిష్యత్తులో సిమ్రాన్ రికార్డ్ బ్రేక్ కావడం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ మూడు చిత్రాలు కాకుండా సిమ్రాన్ తెలుగులో నువ్వొస్తావని, ప్రేమతో రా, సీతయ్య లాంటి హిట్స్ కూడా అందుకుంది.
Simran, Balakrishna
సిమ్రాన్ ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు. వివాహం చేసుకుని ఫ్యామిలీతో సెటిల్ అయింది. తమిళంలో మాత్రం అప్పుడప్పుడూ మెరుస్తోంది. అన్నయ్య, రాఘవేంద్ర లాంటి చిత్రాల్లో సిమ్రాన్ స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.