సాయిపల్లవి బ్యూటీఫుల్ స్మైల్.. నేచురల్ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. పిక్స్
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లోకేషన్లలో క్యూట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా కొన్ని పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) తక్కవ సమయంలోనే దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తొలుత డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ‘ప్రేమమ్’ సినిమాతో నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది.
టాలీవుడ్ లోకి సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. గ్లామర్ పరంగా కాకుండా తన నటనతోనే మెస్మరైజ్ చేసింది. తెలంగాణ భాష, యాసలో డైలాగ్ లూ చెప్పి ఆకట్టుకుంది. అద్బుతమైన డాన్స్,, పెర్ఫామెన్స్ తో అలరించింది.
‘ఫిదా’ సినిమా హిట్ అవడంతో ఇక తెలుగులోనూ వరుసగా అవకాశాలు అందుకుంది. ‘ఎంసీఏ’, ‘పడిపడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాట పర్వం’ చిత్రాలతో అలరించింది. చివరిగా తమిళంలో ‘గార్గి’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం తమిళంలో శివకార్తీకేయ 21వ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ కొనసాగుతోంది. అయితే, కాస్తా గ్యాప్ దొరకడంతో సాయిపల్లవి కొద్దిరోజులు వెకేషన్ కు వెళ్లింది. బ్యూటీఫుల్ లోకేషన్లలో ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. సింపుల్ లుక్ లో మరింత క్యూట్ గా అట్రాక్ట్ చేసింది.
తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆహాల్లాదకరమైన వాతావరణంలో సాయిపల్లవి రిలాక్స్ అవుతూ కనిపించింది. చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు, అందమైన ప్రకృతిని చూస్తూ ఆస్వాదించింది. మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
ఇక సాయిపల్లవి ఎప్పుడూ గ్లామర్ షో చేయరు. కేవలం తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. అందుకే సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంటుంది.