- Home
- Entertainment
- Rashmika: 100 కాదు 1000 సార్లు చేస్తా, విజయ్ అంటే పిచ్చి.. నా ఫ్యామిలీ జోలికొస్తే సహించను, రష్మిక వార్నింగ్
Rashmika: 100 కాదు 1000 సార్లు చేస్తా, విజయ్ అంటే పిచ్చి.. నా ఫ్యామిలీ జోలికొస్తే సహించను, రష్మిక వార్నింగ్
తనపై, విజయ్ దేవరకొండపై వస్తున్న ట్రోలింగ్‌కు రష్మిక మందన్న గట్టిగా బదులిచ్చారు. తన భర్తపై ప్రేమను వ్యక్తం చేస్తూ, కుటుంబం జోలికి వస్తే సహించనని హెచ్చరించారు.

Rashmika Mandanna
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఇటీవల నెగిటివ్ ప్రచారం ఎక్కువైంది. రణబాలి సినిమా రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ పై ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. విజయ్ , రష్మిక రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో రష్మిక మాట్లాడుతూ విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవడానికి అతడికి తాను 100 సార్లు ప్రపోజ్ చేసినట్లు రష్మిక సరదాగా చెప్పారు. కానీ ఇది నెటిజన్లలో, ట్రోలర్స్ లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. దీనితో అనేక రకాలుగా రష్మిక, విజయ్ పై ట్రోలింగ్ జరిగింది. కానీ రష్మిక ఎట్టకేలకు సుదీర్ఘమైన సోషల్ మీడియా పోస్ట్ తో ట్రోలర్స్ నోర్లు మూయించారు. రష్మిక తన పోస్ట్ లో ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.
ప్రేమించే వారికి, ద్వేషించే వారికి ఇదే నా క్లారిటీ
నా గురించి, విజ్జు గురించి ఇంటర్నెట్ లో ఉన్న ప్రజలు చిన్న క్లారిటీ.. నేను సాధారణంగా ఇలాంటి విషయాలపై స్పందించను, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయాలు ఉండే హక్కు ఉంది. కొన్నిసార్లు నేను వాటిని చదివి, వేరే కోణాన్ని అర్థం చేసుకోవడానికి ఆనందిస్తాను. కానీ మా ఇంటర్వ్యూపై ప్రస్తుతం నడుస్తున్న రచ్చ, ప్రజలు అభిప్రాయాలు చెప్పడంలా లేదు... తమ కోపాన్ని వెళ్లగక్కడానికి ఎవరో ఒకరి కోసం చూస్తున్న ఒక ఆగ్రహించిన గుంపులా అనిపిస్తోంది. ఎక్కడో మధ్యలో అసలు విషయం మారిపోయింది. బహుశా అది మీ దృష్టికి సరిపోలేదేమో. బహుశా మీలో కొందరు దాన్ని చూడటానికి ఇష్టపడటం లేదేమో.
అసలేం జరుగుతోంది ?
అది ఎన్ని సార్లు జరిగింది ? ఎంత సమయం జరిగింది అనే దాని గురించి కాదు. మీరు అక్కడే ఆగిపోయారు. కానీ మా మధ్య జరిగిన గొప్ప ప్రపోజల్ ని ఎవరూ గుర్తించలేదు. అవును, ఆ సంభాషణ జరిగింది. కానీ మాలో ఎవరూ ఒక గొప్ప ప్రపోజల్ కోసం చూడలేదు. ఆ సంభాషణ దేని గురించి అంటే — మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం,స్వేచ్ఛ తీసుకోవాలని, జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, సంతోషాలు, ఒత్తిళ్లు ఏవైనా సరే, మేము కోరుకున్నది ఇదేనని, దీనికి ఇదే సరైన సమయమని నిర్ధారించుకోవాలని అతను అనుకున్నాడు. మేము అలాగే చేశాము. మేము ఒకరినొకరు ఎంచుకున్నాము.
100 కాదు 1000 సార్లు చేస్తా, తప్పేంటి ?
నాకు ఏం కావాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది. అదే విధంగా అతడికి ఏం కావాలో ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే హక్కు అతడికి కూడా ఉంది. అందుకే ప్రపోజల్ సంఖ్య మార్చలేదు. నేను పూర్తిగా హృదయంతో ఆలోచిస్తాను, అతను ఆలోచించే వ్యక్తి — మా ఇద్దరి జీవితాల్లో ఒకరికొకరు అది అవసరం. మాకు, పెళ్లి అనేది ఒక ప్రపోజల్, మోకాళ్లపై నిలబడటం లేదా వేలికి ఉంగరం తొడగడం గురించి ఎప్పుడూ కాదు. అవన్నీ కేవలం అలంకరణ మాత్రమే. మాకు, అది కలిసి ఒక జీవితాన్ని, భవిష్యత్తును నిర్మించుకోవడం గురించి.
ఇప్పటివరకు మేమది చాలా అందంగా చేశామని అనుకుంటున్నాను. మీరు దేనికోసమైనా ఎంత దూరమైనా వెళ్లగలిగే వ్యక్తిని కనుగొనండి, మీ కోసం అలాగే చేసే వ్యక్తిని కనుగొనండి.
అవును, నేను నా భర్త పిచ్చి ప్రేమలో మునిగిపోయాను (OBSESSED). అది ఎప్పటినుంచి చెడు విషయంగా మారింది? నేను పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రేమించకపోతే, లోకంలో ఇంకెందుకు నేను అతనిని పెళ్లి చేసుకుంటాను?
అతను జీవితాంతం నా తోడుగా ఉండబోతున్నాడు. నా సాధారణ రోజుల్లోనూ, అసాధారణ రోజుల్లోనూ నా స్నేహితుడు. నా పిల్లలకు తండ్రి. నేను కలిసి వృద్ధురాలినయ్యే నా మనిషి. కాబట్టి నేను 100 సార్లు కాదు 1000 సార్లు ప్రపోజ్ చేస్తాను.
నా కష్టాల్లో విజయ్ మాత్రమే తోడుగా ఉన్నాడు
అక్కడ ఉన్న నా కొంతమంది మంచి అమ్మాయిలకు...నా క్షేమం కోరే నెపంతో రీల్స్ చేస్తూ, నన్ను పారిపోమని చెబుతూ, నన్ను కాపాడటానికి ఉచిత రిలేషన్‌షిప్ సలహాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు. కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెవరూ నాకు తోడుగా లేరు. విజయ్ మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతం, నా జీవితంలో నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. నా ముఖంలో, పెళ్లయినప్పటి నుండి నేను పొందిన ఆనందంలో, నా నటనలో, నా సినిమాల్లో, నేను జీవిస్తున్న విధానంలో మీరు దాన్ని చూడగలరని ఆశిస్తున్నాను. నా జీవితం గురించి నేను చెప్పేది నమ్మడం కంటే, ఇంటర్నెట్‌లో ఎవరో తయారు చేసిన అబద్ధాలు, ఫేక్ ఎడిట్‌లు, విచిత్ర కథనాలను నమ్మడానికి కొందరు మొగ్గు చూపడం నిజంగా కొంచెం భయానకంగా ఉంది.
నా కుటుంబం జోలికి వస్తే సహించను
ఫెమినిజం పేరుతో మీరు చేసే వేధింపులు సరైనవి కాదు. నా గురించి ఎంతైనా మాట్లాడుకోండి భరిస్తాను. కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం సహించను. వేరొకరిని తక్కువ చేయడం లేదా ఆధిక్యతను నిరూపించుకోవడం ఫెమినిజం ఎప్పుడూ కాదు.. అంటూ రష్మిక ట్రోలర్స్ కి ఊహించని కౌంటర్ ఇచ్చారు.
దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్
విజయ్ దేవరకొండ, రష్మిక పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విరోష్ టీమ్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్ ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని, అయితే ఇలా కావాలనే చేసే తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోమని విరోష్ టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డి.సి.పి.కి వారు అందజేశారు. విరోష్ గౌరవాన్ని కాపాడేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారి టీమ్ తెలియజేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

