MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nithya Menen: డైరెక్టర్లు, రైటర్లకు స్వేచ్ఛ కరువైంది.. దుమారం రేపుతున్న నిత్యా మీనన్‌ కామెంట్స్

Nithya Menen: డైరెక్టర్లు, రైటర్లకు స్వేచ్ఛ కరువైంది.. దుమారం రేపుతున్న నిత్యా మీనన్‌ కామెంట్స్

నటి నిత్యా మీనన్ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్లు, రైటర్లకు ఇప్పుడు స్వేచ్ఛ తగ్గిపోతోందని అన్నారు. ప్రేక్షకులు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Oct 26 2026, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సినిమాలు తగ్గించిన నిత్యా మీనన్
Image Credit : others

సినిమాలు తగ్గించిన నిత్యా మీనన్

`అలా మొదలైంది` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాలయాళ భామ నిత్యా మీనన్‌. మంచి నటనతో ఆకట్టుకుంది. బబ్లీ లుక్‌తోనూ మెప్పించింది. ఆ తర్వాత `ఇష్క్`, `గుండెజారి గల్లంతయ్యిందే`, `ఒక్కడినే`, `జబర్దస్త్`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `రుద్రమదేవి`, `జనతా గ్యారేజ్‌` వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

ఆ తర్వాత క్యారెక్టర్స్ చేస్తూ మెప్పించింది. ఈ మధ్య సినిమాలు తగ్గించింది. కానీ ఇప్పుడు `గరివిడి లక్ష్మి` చిత్రంలో పాత్రని రిజెక్ట్ చేసి వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పెద్ద దుమారం రేపుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్వేచ్ఛ కరువైంది
Image Credit : instagram / Nithya Menen

స్వేచ్ఛ కరువైంది

నిత్యా మీనన్ మాట్లాడుతూ.. డైరెక్టర్లు, క్రియేటివ్ రైటర్లకు ఈ రోజుల్లో భావప్రకటనా స్వేచ్ఛ బాగా తగ్గిపోతోందని అన్నారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

34
క్రియేటివిటీకి అడ్డుకట్ట
Image Credit : Instagram / Nithya Menen

క్రియేటివిటీకి అడ్డుకట్ట

ప్రేక్షకులు ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవ్వడం, హర్ట్ అవ్వడం క్రియేటివిటీకి అడ్డుకట్ట వేస్తోందని నిత్యా మీనన్ చెప్పారు. అందరూ ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషిస్తుండటంతో, ఒకే తరహా సినిమాలు తీయాల్సిన పరిస్థితి వస్తోందని ఆమె అన్నారు.

నిత్యా మీనన్ మహిళలు ఎదుర్కొనే ఒత్తిడి గురించి కూడా మాట్లాడారు. కెరీర్, వ్యక్తిగత బంధాలను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఈ ఒత్తిడి ఉంటుందని.. అయితే మహిళలు తమ వృత్తిని, జీవితాన్ని రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలరని ఆమె స్పష్టం చేశారు.

44
మహిళలపై ఒత్తిడి
Image Credit : instagram / Nithya Menen

మహిళలపై ఒత్తిడి

కెరీర్, ఫ్యామిలీ.. ఈ రెండింటిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదని నిత్యా మీనన్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తూ సామాజికంగా, శారీరకంగా మహిళలు ఇప్పటికీ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Censor Review: ఆదర్శ కుటుంబం సెన్సార్‌ రివ్యూ, రిపోర్ట్ ఏంటి? ఈ మూవీని ఎవరు చూడొచ్చు?
Recommended image2
Rashmika: 100 కాదు 1000 సార్లు చేస్తా, విజయ్ అంటే పిచ్చి.. నా ఫ్యామిలీ జోలికొస్తే సహించను, రష్మిక వార్నింగ్
Recommended image3
Top 5 Kollywood Films 2026: ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే.. సూర్యకి రజనీ షాక్‌
Related Stories
Recommended image1
AK 47 Censor Review: ఆదర్శ కుటుంబం సెన్సార్‌ రివ్యూ, రిపోర్ట్ ఏంటి? ఈ మూవీని ఎవరు చూడొచ్చు?
Recommended image2
Krishnam Raju: కృష్ణంరాజుని ఒరేయ్‌ అని పిలిచే ఏకైక సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ విషయం తెలిసి మతిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved