MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ రాశి కూతురు ఎలా ఉందో చూశారా.. అమ్మ క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు, ముఖం మీదే చెప్పేసింది

హీరోయిన్ రాశి కూతురు ఎలా ఉందో చూశారా.. అమ్మ క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు, ముఖం మీదే చెప్పేసింది

సీనియర్ హీరోయిన్ రాశి తన కుమార్తెని తొలిసారి మీడియా ముందు పరిచయం చేశారు. తన తల్లి నటించే పాత్రల గురించి రాశి కూతురు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 07 2025, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాశి నటించిన చిత్రాలు
Image Credit : Instagram/Raasi

రాశి నటించిన చిత్రాలు

సీనియర్ నటి రాశి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో రాశి హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగులో చాలా మంది అగ్ర హీరోలతో రాశి నటించింది. రాశి ఎక్కువగా శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత చిత్రంలో రాశి నటించింది. శుభాకాంక్షలు, గోకులంలో సీత, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, దేవుళ్ళు, పెళ్లి పందిరి లాంటి గొప్ప చిత్రాల్లో రాశి నటించింది.

DID YOU
KNOW
?
రంగస్థలం మిస్ చేసుకున్న రాశి
రాంచరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం ముందుగా రాశికి దక్కింది. కానీ ఆ పాత్ర నచ్చకపోవడంతో రాశి రిజెక్ట్ చేసింది. దీనితో ఆ గోల్డెన్ ఛాన్స్ అనసూయకి దక్కింది. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం 
Image Credit : Instagram/Raasi

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం 

వివాహం తర్వాత కుటుంబం, కుమార్తె బాధ్యతలతో రాశి సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు రాశి ప్రయత్నిస్తోంది. ఇటీవల రాశి ఉసురే అనే చిత్రంలో నటించింది. ఆగష్టు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రాశి హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు. రాశి ఈ చిత్రాన్ని తన కంబ్యాక్ మూవీగా భావిస్తున్నారు. 

35
కూతురితో కలిసి ఉసురే మూవీ చూసిన రాశి 
Image Credit : Youtube/Idream

కూతురితో కలిసి ఉసురే మూవీ చూసిన రాశి 

ఈ చిత్రాన్ని రాశి తన కుమార్తె, ఇతర చిత్ర యూనిట్ తో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా రాశి తన కుమార్తెని తొలిసారి కెమెరా ముందు మీడియాకి, ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఉసురే మూవీలో మీ అమ్మ క్యారెక్టర్ ఎలా ఉంది అని ప్రశ్నించగా.. రాశి కుమార్తె మొహమాటం లేకుండా ఈవిల్ అని కామెంట్ చేసింది. తనకి తన తల్లి పాత్ర ఏమాత్రం నచ్చలేదని ముఖం మీదే చెప్పేసింది. 

45
రాశి కూతురి కామెంట్స్ 
Image Credit : Youtube/Idream

రాశి కూతురి కామెంట్స్ 

మా అమ్మ బ్యాడ్ క్యారెక్టర్స్ లో నటిస్తే తనకు నచ్చదని, తక్కువ నెగిటివిటీ ఉన్న క్యారెక్టర్స్ లో నటించాలని కోరుకుంటున్నట్లు రాశి కుమార్తె పేర్కొంది. తనకి సినిమాలపై అప్పుడే ఆసక్తి లేదని అమ్మ కోసమే ఈ మూవీ చూడడానికి వచ్చినట్లు రాశి కూతురు పేర్కొంది. రాశి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తానని.. కాకపోతే కథలో తన పాత్ర కీలకం కావాలని రాశి తెలిపారు. కుటుంబం కోసమే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు నా కూతురు తన పనులు తాను చేసుకోగలుగుతోంది. కాబట్టి ఇకపై తాను సినిమాలపై ఫోకస్ చేస్తానని అన్నారు. 

55
పవన్ కళ్యాణ్ పై రాశి వ్యాఖ్యలు
Image Credit : Youtube/Raasi

పవన్ కళ్యాణ్ పై రాశి వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ పై కూడా రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోకులంలో సీత చిత్రంలో మీరు కలిసి నటించిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా అని ప్రశ్నించినప్పుడు రాశి స్పందించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం సంతోషించదగ్గ విషయం. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ఇంకా చాలా ఆనందంగా ఉంది అని రాశి పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
నాకు సమానమైన నటుడు అతడే, ఎన్టీఆర్ కాదు.. క్రేజీ హీరో స్థాయి ఏంటో చెప్పేసిన ఏఎన్నార్
Recommended image2
Mayasabha Review: 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ, రేటింగ్.. పొలిటికల్ డ్రామా ఆకట్టుకుందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved