- Home
- Entertainment
- నాకు సమానమైన నటుడు అతడే, ఎన్టీఆర్ కాదు.. క్రేజీ హీరో స్థాయి ఏంటో చెప్పేసిన ఏఎన్నార్
నాకు సమానమైన నటుడు అతడే, ఎన్టీఆర్ కాదు.. క్రేజీ హీరో స్థాయి ఏంటో చెప్పేసిన ఏఎన్నార్
తనకి సమానమైన నటుడు ఎవరు అనేది ఏఎన్నార్ ఓ సందర్భంలో బయటపెట్టారు. అంతా అనుకుంటున్నట్లు తనకి సమానమైన నటుడు ఎన్టీఆర్ అని చెప్పలేదు. ఏఎన్నార్ చెప్పింది ఎవరి గురించో ఈ కథనంలో తెలుసుకోండి.

ఏఎన్నార్ కామెంట్స్ వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశం గర్వించదగ్గ నటుల్లో అక్కినేని నాగేశ్వర రావు ఒకరు. పౌరాణిక, జానపద, సాంఘిక ఇలా అన్ని జోనర్ చిత్రాల్లో ఏఎన్నార్ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా అప్పట్లో ప్రేమ కథా చిత్రాలకు ఆయన బ్రాండ్. అందుకే లేడీస్ లో ఏఎన్నార్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే తన నటనకు తగ్గ హీరో ఎవరనే అంశంపై ఓ సందర్భంలో ఏఎన్నార్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
KNOW
తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు
సాధారణంగా ఏఎన్నార్ కి సమానమైన నటుడు ఎవరంటే వెంటనే వచ్చే ఆన్సర్ ఎన్టీఆర్ అని. ఎందుకంటే దశాబ్దాల కాలం వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లుగా పోటాపోటీగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ కి మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే ఏఎన్నార్ కి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో, లేడీస్ లో ఫాలోయింగ్ ఉండేది. అయితే ఏఎన్నార్ మాత్రం తనకి సమానమైన నటుడు శోభన్ బాబు అని ఓ సందర్భంలో అన్నారు.
శోభన్ బాబుపై ప్రశంసలు
ఏఎన్నార్ మాట్లాడుతూ.. శోభన్ బాబు ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. ఆయన అద్భుతమైన నటుడు మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా. ఆయనలో మరో ముఖ్యమైన లక్షణం ఉంది. ఆయన వివాదరహితుడు. ఎవ్వరినీ పొరపాటున కూడా ఒక్క మాట కూడా అనేవారు కాదు. అదే విధంగా వేరేవాళ్ళ నుంచి తాను మాటలు అనిపించుకునేవారు కాదు.
నా స్థానాన్ని భర్తీ చేయగల నటుడు అతడే
నాలాగా శోభన్ బాబు సోషల్ చిత్రాల్లో ఎక్కువగా నటించేవారు. శోభన్ బాబుని చూస్తే నాకు ఎప్పుడూ ఒక విషయం అనిపిస్తుంది. నాకు సర్జరీ జరిగినప్పుడు ఇక నేను నటించలేని పరిస్థితి ఏర్పడి ఉంటే.. నా స్థానాన్ని భర్తీ చేయగల నటుడు శోభన్ బాబు మాత్రమే అని అనిపించేది అంటూ ఏఎన్నార్ ప్రశంసలు కురిపించారు.
ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఎదిగిన శోభన్ బాబు
ఏఎన్నార్ తరహాలోనే శోభన్ బాబు అందగాడిగా మహిళల్లో విపరీతమైన ఆదరణ పొందారు. శోభన్ బాబు కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. శోభన్ బాబుకి మంచి గుర్తింపు రావడానికి పదేళ్ల సమయం పట్టింది. శోభన్ బాబు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లతో కలిసి ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు.