- Home
- Entertainment
- పారిస్ లో బాలయ్య హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్.. తక్షణమే వెనక్కి రమ్మంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. పిక్స్ వైరల్
పారిస్ లో బాలయ్య హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్.. తక్షణమే వెనక్కి రమ్మంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. పిక్స్ వైరల్
హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) పారిస్ లో రచ్చరచ్చ చేస్తోంది. అక్కడి వీధుల్లో ఈ గ్లామర్ బ్యూటీ స్వేచ్ఛగా తిరిగేస్తోంది. అయితే రకుల్ ప్రీత్ మాత్రం ప్రాగ్యాను వెంటనే తిరిగి రమ్మంటోంది.

వరుస పరాజయాలతో ఉన్న ప్రాగ్యా జైశ్వాల్ కి నందమూరి నటసింహం, టాలీవుడ్ సినీయర్ హీరో బాలకృష్ణ `అఖండ` చిత్రంతో బిగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది ప్రాగ్యా. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిచేందుకు ఈ బ్యూటీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘అఖండ’ తర్వాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు సరసన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
వెంటనే బాలీవుడ్ లో సల్మాన్ సరసన నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. బాయ్ జాన్ తో కలిసి ‘మే ఛలా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించిందీ బ్యూటీ. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి కాస్తా రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సినిమాను ప్రకటించలేదు ప్రాగ్యా.
ఒక్క సినిమా హిట్ కొట్టిన హీరోయిన్లు ఆ వెంటనే వరుసగా నాలుగైదు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. కానీ ప్రాగ్యా మాత్రం ఆ విషయంలో కాస్తా వెనకబడిందనే చెప్పాలి. ప్రస్తుతం తన చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదని తెలుస్తోంది. మున్ముందు ఎలాంటి సినిమాలో కనిపించబోతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రాగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఎప్పుడూ ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడి నుంచి పలు చిత్రాలను అభిమానులతో పంచుకుంది.
ఇదిలా ఉంటే ప్రాగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఎప్పుడూ ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడి నుంచి పలు చిత్రాలను అభిమానులతో పంచుకుంది.
ఈ పిక్స్ లో ప్రాగ్యా టైట్ ఫిట్ మినీ బ్లాక్ డ్రెస్ లో మతిపోగొడుతోంది. పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ మతిపోగొట్టిందీ బ్యూటీ. ఆ పిక్స్ ను తాజాగా తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ పిక్స్ ను చూసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కామెంట్ చేసింది. ‘ఇప్పుడే తిరిగి వచ్చేయ్.! స్పార్క్ నిన్ను కోల్పోయింది’ అని పేర్కొంది. మరోవైపు అభిమానులు ఈ పిక్స్ ను లైక్ లు, కామెంట్లో వైరల్ చేస్తున్నారు.