ప్రగ్యా ఎంత ప్రయత్నించినా ఫలితం లేదేంటీ? బాలయ్య భామ చిరునవ్వుకు కుర్రగుండెల్లో అలజడే!
నార్త్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది. బ్యూటీఫుల్ స్మైల్ తో కుర్ర గుండెల్ని కొల్లగుడుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్ లో ప్రగ్యా కట్టిపడేస్తోంది.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది యంగ్ బ్యూటీ ప్రగ్యాజైశ్వాల్. చివరిగా ‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. సీనియర్ నటుడు బాలయ్య సరసన యంగ్ బ్యూటీ తనదైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మరోవైపు అందంతోనూ ఆకట్టుకుంది.
అయితే, ప్రగ్యా తొలుత ‘డేగ’,‘మిర్చిలాంటి కుర్రాడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ‘కంచె’ చిత్రంతో హిట్ ను అందుకుంది. ఆ చిత్రంలోని తన నటనతో ప్రగ్యా ప్రేక్షకులను కట్టిపడేసింది. వెండితెరపై ఏమాత్రం గ్లామర్ షో లేకుండానే అలరించింది.
దాదాపు పదేండ్లుగా ప్రగ్యా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయా సినిమాల్లో మెరుస్తూనే వస్తున్నారు. అయినా పెద్దగా హిట్లు లేకపోవడంతో ఈ బ్యూటీ కేరీర్ స్పీడ్ అందుకోవడం లేదు. చివరిగా Akhandaతో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే జోష్ లో ఉంది.
ఈ సందర్భంగా ప్రగ్యా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించే ఈ భామ.. ఇంత వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. మున్ముందు ఏఏ చిత్రాల్లో కనిపించబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీంతో అవకాశాల వేటలో భాగంగా ప్రగ్యా సోషల్ మీడియాలోనూ తెగ యాక్టవ్ గా కనిపిస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను ఆరబోస్తోంది. ఏకంగా స్కిన్ షోతోనూ రెచ్చిపోతోంది. పద్ధతిగా మెరిసేటి ఈ భామ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరుస్తూ పరువాలను ప్రదర్శిస్తోంది. ఇలా ఎంత ప్రయత్నించినా కొత్త ప్రాజెక్ట్స్ రాకపోవడం గమనార్హం అంటున్నారు.
తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో దర్శనమిచ్చిందీ భామ. వైట్ చుడీదార్ లో మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్ తోనూ కట్టిపడేసింది. ఫ్యాన్స్ కూడా ప్రగ్యా పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. చివరిగా మరోసారి బాలయ్య సరసన ఓ యాడ్ షూట్ లో పాల్గొంది.