రెండో పెళ్లి చేసుకోబోతున్న నటి ప్రగతి.. టాలీవుడ్ నిర్మాత ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ?
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది.
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు.
అయితే ప్రగతి కొంతకాలంగా సోషల్ మీడియాలో కొత్త ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. తరచుగా జిమ్ వీడియోలు, ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేస్తూ ప్రగతి బాగా పాపులర్ అవుతున్నారు. అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ప్రగతి తరచుగా మాట్లాడుతోంది.
pragathi
పర్సనల్ లైఫ్ విషయాల్ని కూడా ప్రగతి పలు ఇంటర్వ్యూలలో పంచుకుంది. గతంలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. కానీ భర్తతో విభేదాలు వచ్చి విడిపోయా.. భవిష్యత్తులో పెళ్లి ఆలోచనే లేదు అని ప్రగతి తెలిపింది.
ఇంట్లో ఊరికే కూర్చుని తింటున్నావ్ అని తన తల్లి అన్న మాటలతోనే ఆమెకి కష్టాలు మొదలైనట్లు ప్రగతి తెలిపింది. సంపాదన కోసం పిజ్జా షాప్ లో, ఎస్టీడీ బూత్ లలో కూడా పనిచేసినట్లు ప్రగతి పేర్కొంది. ఆ తర్వాత యాడ్ లలో నటించే అవకాశం రావడం.. దానితో మోడలింగ్ లోకి అడుగుపెట్టినట్లు ప్రగతి పేర్కొంది.
Pragathi
భర్తతో పిన్న వయసులోనే విడిపోయాక ప్రగతి పిల్లల పోషణ కోసం ఎన్నో కష్టాలు పడిందట. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ప్రగతి వయసు 47. ఇక పెళ్లి చేసుకోకూడదు అనుకున్నప్పటికీ ప్రగతి రెండవ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
47 ఎల్లా వయసులో కూడా హాట్ లో కనిపిస్తున్న ప్రగతికి టాలీవుడ్ లో ఓ నిర్మాత మ్యారేజ్ చేసుకుంటానని ప్రపోజ్ చేశాడట. గతంలో ప్రగతి అతడి చిత్రాల్లో కూడా నటించినట్లు తెలుస్తోంది. నిర్మాత స్వయంగా వచ్చి ప్రేమతో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రగతి కూడా అంగీకారం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
తనకు కూడా ఓ తోడు ఉంటే బావుంటుంది కాబట్టి ప్రగతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 40 ప్లస్ ఏజ్ లో రెండవ వివాహాలు కొత్తేమి కాదు. గతంలో సింగర్ సునీత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రగతి గురించి వస్తున్న వార్తల్లో అధికారిక సమాచారం లేదు.