పాయల్ రాజ్ పుత్ కు పితృవియోగం, స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ సోమవారం కన్నుమూశారు. తండ్రిని తలుచుకుంటూ హీరోయిన్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. స్టార్యనటికి పితృ వియోగం కలిగింది. పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ 67 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో పోరాడుతూ జూలై 28న మృతి చెందారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త పాయల్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. తండ్రి మరణంతో ఆమె సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేశారు.
KNOW
పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ పోస్ట్
తండ్రి మరణం తట్టుకోలేకపోతోంది పాయల్ రాజ్‌పుత్. తండ్రిని తలుచుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. “నాన్నా…” అంటూ గుండె పగిలిన ఎమోజీని షేర్ చేస్తూ తన బాధను చెప్పుకున్నారు పాయల్. “నువ్వు ఇకపై ప్రత్యక్షంగా నాతో ఉండలేవు. కానీ నీ ప్రేమ నాతో ఉంటుంది. నీ నవ్వులు, నీ స్వరం, నీ ఉనికి... ఇవన్నీ నేను మిస్సవుతూనే ఉంటాను. ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్లిపోయే ఉండొచ్చు కానీ నా హృదయం నుంచి కాదు. లవ్ యూ పప్పా” అంటూ ఆమె తన మనసులో బాధను వెల్లడించారు.
పప్పా క్షమించు
ఇంతకుముందు కూడా పాయల్ రాజ్ పుత్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమో థెరపీ జరుగుతోందని, తన తండ్రి కోలుకోవడం కోసం అందరి ప్రార్ధనలు కావాలని సోషల్ మీడియాలో కోరారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, పాయల్ తండ్రి కాన్సార్ ను వ్యాధిని అధిగమించలేకపోయారు.
“పప్పా... నేను నీకు చేయగలిగిందంతా చేశాను. క్యాన్సర్‌తో ఎంత పోరాటం చేయాలో అంతా చేశాం. కానీ మనం గెలవలేకపోయాం. క్షమించు నాన్నా... లవ్ యూ,” అంటూ పాయల్ తన బాధను మరో పోస్టులో వ్యక్తం చేశారు.
సంతాపం ప్రకటించిన సెలబ్రిటీలు
పాయల్ పోస్టును చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలిపారు. నటి రాయ్ లక్ష్మీ, దివి, పాయల్ రాజ్ పుత్ ప్రియుడు సౌరభ్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా పాయల్‌కు ధైర్యం చెప్పారు. “నీ పరిస్థితి ఎలా ఉంటుందో మేం ఊహించగలం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. దేవుడు నీకు బలం ఇవ్వాలి,” అంటూ రాయ్ లక్ష్మీ స్పందించారు.
పాయల్ రాజ్ పుత్ సినిమాలు
పాయల్ రాజ్‌పుత్ తెలుగులో 'ఆర్ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆతరువాత వెంకటేష్ సరసన 'వెంకీ మామ', రవితేజతో 'డిస్కో రాజా', ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. అడపా దడపా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకున్నారు పాయల్.

