MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pavitra Lokesh: సైబర్ పోలీసులకు నటి పవిత్ర లోకేష్ ఫిర్యాదు.. ఆకతాయిలు సోషల్ మీడియాలో అలా చేస్తూ..

Pavitra Lokesh: సైబర్ పోలీసులకు నటి పవిత్ర లోకేష్ ఫిర్యాదు.. ఆకతాయిలు సోషల్ మీడియాలో అలా చేస్తూ..

నటి పవిత్ర లోకేష్.. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీనియర్ నటిగా పవిత్ర లోకేష్ దక్షిణాది భాషల్లో గుర్తింపు పొందారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 01 2022, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి పవిత్ర లోకేష్.. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీనియర్ నటిగా పవిత్ర లోకేష్ దక్షిణాది భాషల్లో గుర్తింపు పొందారు. తల్లి పాత్రలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరోవైపు సీనియర్ నటుడు నరేష్ తో ఆమె రిలేషన్ షిప్ గురించి రూమర్స్ ఎక్కువవుతున్నాయి. 

26

కానీ ఆ రూమర్స్ విషయంలో పవిత్ర లోకేష్ నోరు మెదపడం లేదు. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నరేష్ తన మూడవ భార్యతో విడిపోయారు. కొంతకాలంగా నరేష్.. పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నారు. పవిత్ర కూడా తన భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 

36

దీనితో ఆమె కూడా నరేష్ కి చేరువైనట్లు తెలుస్తోంది. కొంత కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా పవిత్ర స్వస్థలం మైసూర్. బుధవారం రోజు ఆమె మైసూరులో సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులే మీడియాకు తెలిపారు. 

46

ఫేస్ బుక్ లో పవిత్ర లోకేష్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆకతాయిలు కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యంగా పోస్ట్ లు పెడుతూ, అసత్యాలు ప్రచారం చేస్తూ తనకి పరువు నష్టం కలిగిస్తున్నారని, మానసిక ప్రశాంతత దూరం చేస్తున్నారు అంటూ పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారట. 

56
Naresh- Pavitra Lokesh

Naresh- Pavitra Lokesh

దీనితో మైసూర్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆకతాయిలని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ఫేక్ అకౌంట్స్ ని డిలీట్ చేస్తున్నారు. పవిత్ర లోకేష్ కన్నడ నటుడు, దర్శకుడు మైసూర్ లోకేష్ కుమార్తె. ఆయన వారసురాలిగా పవిత్ర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

66

పవిత్ర లోకేష్, నరేష్ తో కలసి ఆలయాలు సందర్శిస్తున్నట్లు, పూజలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరిద్దరి రిలేషన్ పై క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image3
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved