బంగారు రంగు చీరకట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో నేహా శెట్టి మెరుపులు.. మొత్తానికి ఇప్పుడు రీచ్ అయ్యిందిగా..
యంగ్ బ్యూటీ నేహా శెట్టి కొద్దినెలలుగా తన కెరీర్ పై బాగా ఫోకస్ పెట్టింది. రాబోయేచిత్రాలను ప్రమోట్ చేసుకుంటూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ స్థాయిలో ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలు చేస్తోంది. ఒక్కో సినిమా విడుదలవుతున్న క్రమంలో సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. చీరకట్టులో మతులుపోయేలా ఫొటోషూట్లు చేస్తూ మైమరిపిస్తోంది. అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
లేటెస్ట్ ఫొటోస్ లో ఈ ముద్దుగుమ్మ బంగారు రంగు చీరలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ బ్లౌజ్ లో, చీరకట్టులో చూపుతిప్పుకోకుండా చేసింది. సిట్టింగ్ ఫోజుల్లో మత్తెక్కించేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. గుచ్చే చూపులతో యువతను చిత్తు చేసింది.
కొద్దిరోజులుగా నేహా శెట్టి సోషల్ మీడియాలో గ్లామర్ విందుతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నెట్టింట చేస్తున్న రచ్చతో ఇన్ స్టాలో ఎట్టకేళలకు 1 మిలియన్ ఫ్యామిలీలో చేరింది.
ఈ సందర్భంగా చీరకట్టులో మరింత అందంగా మెరిసింది. బ్యూటీఫుల్ ఫోజులతో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. తాజాగా బ్యూటీ పంచుకున్నఫొటోస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో కుర్ర హీరోయిన్ ను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
రీసెంట్ గానే నేహా శెట్టి ‘బెదురులంక2012’ చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఈ నెలలో కిరణ్ అబ్బవరంతో కలిసి ‘రూల్స్ రంజన్’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోనూ నటిస్తోంది.