సుశాంత్ లాగే చనిపోవాలనుకున్నా.. నటి ఎమోషనల్ కామెంట్స్
హీరోయిన్ నీతూ చంద్ర తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో మెరిసింది. శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో నీతూ చంద్ర కీలక పాత్రలో నటించింది.

హీరోయిన్ నీతూ చంద్ర తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో మెరిసింది. శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో నీతూ చంద్ర కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత సత్యమేవ జయతే చిత్రంలో నటించింది. ఇక నాగార్జున 'మనం' చిత్రంలో నీతూ చంద్ర చిన్న పాత్రలో మెరిసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ 38 ఏళ్ళు హాట్ బ్యూటీ ఎప్పుడూ గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది. అయితే నీతూ చంద్ర కెరీర్ లో కూడా డార్క్ సైడ్ ఉంది. కెరీర్ లో నిలదొక్కుకునేందుకు ఎన్నో వేధింపులకు గురయ్యానని తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది. తనకు ఎదురైన వేధింపులని గుర్తు చేసుకుంటూ నీతూ చంద్ర భావోద్వేగానికి గురైంది.
చాలా మంది నటులకు మరణం తర్వాతే మంచి గుర్తిపు వస్తుంది. బతికి ఉన్నప్పుడు వారి కష్టాన్ని, ట్యాలెంట్ ని ఎవరూ గుర్తించరు. బహుశా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అందుకే చనిపోవాలనే స్టెప్ తీసుకున్నాడు. నాకు కూడా సుశాంత్ లాగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. జనాలు చనిపోయిన తర్వాత మాత్రమే ట్యాలెంట్ ని గుర్తిస్తారు అంటూ వాపోయింది.
ఒక ప్రముఖ వ్యాపార వేత్త తనని మానసికంగా వేధించినట్లు నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. నెలకి రూ 25 లక్షలు ఇస్తాను.. నాకు జీతం తీసుకునే భార్యగా ఉండమని వేధించాడు. ఆయన అలా మాట్లాడినప్పుడు నా మనసు ఎంతో గాయపడింది.
ఓ కాస్టింగ్ డైరెక్టర్ వల్ల కూడా తాను బాధపడినట్లు నీతూ చంద్ర వివరించింది. ఆడిషన్స్ కోసం నన్ను ఓ కాస్టింగ్ డైరెక్టర్ పిలిచారు. ఆయన బాగా ఫేమస్. అతడి పేరు బయటకి చెప్పాలని అనుకోవడం లేదు. దాదాపు గంట సేపు నన్ను ఆడిషన్స్ చేశాడు. చివరికి రిజెక్ట్ అని చెప్పాడు. వాస్తవానికి కావాలనే అతడు గంటసేపు ఆడిషన్ చేసి రరిజెక్ట్ చేసినట్లు నీతూ చంద్ర ఆరోపించింది.
తనకు సినిమాల్లో దాదాపు 13 మంది జాతీయ అవార్డు విన్నర్స్ తో కలసి పనిచేసినప్పుడు కూడా సరైన గుర్తింపు దక్కలేదని పేర్కొంది. చిత్ర పరిశ్రమలో నటీమణులకు తరచుగా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. నీతూ చంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.