తిరుమల మాడవీధుల్లో చెప్పులతో నడిచిన నయనతార, ఆపై మహాద్వారం వద్ద ఫోటోషూట్.. వివాదం
పెళ్లయిన మరుసటి రోజే లేడీ సూపర్‌స్టార్ నయనతార వివాదంలో చిక్కుకున్నారు. నిన్న ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడిన నయనతార.. శుక్రవారం భర్తతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వెంకటేశ్వరుని దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వీరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.

nayana
పెళ్లయిన మరుసటి రోజే లేడీ సూపర్‌స్టార్ నయనతార వివాదంలో చిక్కుకున్నారు. నిన్న ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడిన నయనతార.. శుక్రవారం భర్తతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వెంకటేశ్వరుని దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వీరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
nayana
ఇదే పెద్ద వివాదం అయ్యేలా కనిపిస్తుంటే.. శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారానికి సమీపంలో నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఫోటో షూట్ చేసుకోవడం మరో కాంట్రవర్సీకి కారణమైంది. భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో కెమెరాలు వాడటంపై నిషేధం వుంది. మరి వీరి ఫోటోషూట్‌కి అనుమతి ఇచ్చింది ఎవరనే విమర్శలు వస్తున్నాయి.
Nayanthara Vignesh shivan wedding
మరి నయనతార చేసిన పనికి టీటీడీ జరిమానా విధిస్తుందా లేక సెలబ్రెటీ కాబట్టి మందలించి వదిలేస్తుందా అంటూ భక్తులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం అంటే ఇదేనా..? గుడి ప్రాంగణంలో చెప్పులు వేసుకుని తిరుగుతుంటే టీటీడీ నిద్రపోతుందా..? అంటూ ఫైర్ అవుతున్నారు.
nayan
కాగా.. గురువారం ఉదయం 8:30 నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహం ప్రారంభం అయింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది.
మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వలన వేదిక మార్చారు.
nayana
2015లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానున్ రౌడీదాన్ మూవీ విడుదలైంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి-నయనతార హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి వీళ్ళ ప్రేమ ప్రయాణం మొదలైంది. పేరుకు ప్రేమికులే అయినా భార్యాభర్తలుగా మెలిగారు.