MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాగ్రత్త!.. నటుడు ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్?,ఎందుకంటే?

జాగ్రత్త!.. నటుడు ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్?,ఎందుకంటే?

2021 తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవీ విడుదల కాలేదు. ఈ మధ్య కాలంలో ఆమెకు యాక్సిడెంట్ కావడం సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక 

3 Min read
Surya Prakash
Published : Apr 18 2024, 06:42 AM IST| Updated : Apr 18 2024, 07:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Nabha Natesh

Nabha Natesh


ఆ మధ్యన నన్ను దోచుకుందువటే చిత్రంతో పలకరించిన  కన్నడ భామ నభా నటేష్. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అయితే అదే సమయంలో ఆమె యాక్సిడెంట్ కి గురి అయ్యింది. దాంతో గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఫామ్ లోకి వచ్చింది.

213
Nabha Natesh

Nabha Natesh


 కరోనా రావడంతో మూడేళ్లపాటు సినిమాల్లో కనిపించని ఆమె ఇప్పుడు బిజీ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తోంది. తను  పూర్తిగా కోలుకోవడంతో ఆ విషయం చెప్పటానికి అన్నట్లు సోషల్ మీడియాలో రచ్చ  చేస్తోంది.  ఈ క్రమంలోనే  కొంతకాలంగా  ఫోటోషూట్స్ తో దుమ్ము రేపుతూ ఆకట్టుకుంటూ వచ్చిన ఈ భామ.. ఇప్పుడు ప్రభాస్ వాయిస్‌తో డబ్‌స్మాష్ వీడియో చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 

313
Nabha Natesh

Nabha Natesh


డార్లింగ్ అనే పదం ప్రభాస్ కి ఊతపదం అనేది అందరికి తెలిసిందే. సినిమా ఈవెంట్స్ లేదా టీవీ షోల్లో ఎక్కడ కనిపించిన ప్రభాస్ డార్లింగ్ అనే పదంతోనే ఎక్కువుగా మాట్లాడుతుంటారు.  ఇప్పటివరకు ప్రభాస్ మాట్లాడిన కొన్ని ఫేమస్ డార్లింగ్ పదాలన్ని కలిపి ఓ డబ్‌స్మాష్ వీడియోని నభా నటేష్ చేశారు. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 

413


ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. నభా నటేష్ కి లవ్ యు డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ డార్లింగ్ రీల్ ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. ఈ రీల్ మీద నటుడు, హీరో ప్రియదర్శి రెస్పాండ్ అయ్యాడు. వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్.. డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రియదర్శి చేసిన కామెంట్ కు నభా నటేష్ వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుని చూపించింది.

513
Nabha Natesh

Nabha Natesh

 ఇలా డార్లింగ్ అని పిలిస్తే శిక్ష విధిస్తారని, మాటలు కాస్త జాగ్రత్త అని కౌంటర్ వేసింది. దీంతో ప్రియదర్శి మీద ఆమె ఫైర్ అవుతున్నట్లు, మిస్టర్ మాట్లాడే ముందు జాగ్రత్త అని అంటూ ఒక తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం కూడా ఐపిసి సెక్షన్ 354 A ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది అనే ఫోటోని షేర్ చేసింది.

613


 దానికి ప్రియదర్శి కూడా అంతే తెలివిగా సమాధానం ఇచ్చాడు. మనం ఒకరికొకరం తెలియదని నాకు తెలియదు, బై ద వే మీరు డార్లింగ్ అనొచ్చు మేము అంటే ఐపిసి సెక్షన్ 354 ఏ ప్రకారం కేసులు పెడతారా? అని ప్రశ్నిస్తూనే మళ్లీ లైట్ తీసుకో డార్లింగ్ అంటూ కామెంట్ చేశారు.  దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నభా నటేష్, ప్రియదర్శి ట్వీట్ల మీద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

713


ప్రియదర్శి ప్రస్తుతం సినిమాలు,వెబ్ సిరీస్‌లు అంటూ ఎంతగా ట్రెండ్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ఓం భీం బుష్, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 బాగానే వర్కవుట్ అయ్యిన సంగతి తెలిసిందే. తెలుగులో చాలా బిజీగా ఉన్న నటుడుగా దూసుకుపోతున్నారు ప్రియదర్శి.

 

813


మరో ప్రక్క షూటింగ్ లొకేషన్లలో నభా నటేష్ అడుగుపెట్టి మూడేళ్లు అని చెప్పాలి. 2021 తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవీ విడుదల కాలేదు. ఈ మధ్య కాలంలో ఆమెకు యాక్సిడెంట్ కావడం సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై మళ్లీ దృష్టి సారించారు. నిఖిల్, ప్రియదర్శి సరసన సినిమాలు చేస్తున్నారు.

913

నిఖిల్ సిద్ధార్థ  హీరోగా నటిస్తున్న తొలి చారిత్రాత్మక చిత్రం 'స్వయంభు'. అందులో సంయుక్తా మీనన్  హీరోయిన్. అయితే, ఆమెతో పాటు మరొక హీరోయిన్ కు సైతం చోటు ఉందట. ఆ క్యారెక్టర్ నభా నటేష్ ( Swayambhu) సొంతం అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది నభా. 
 

1013


'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి. ఆయన ప్రియదర్శి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. పూర్తిగా కామెడీతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోనూ నభా నటేష్ హీరోయిన్. ఈ రెండు కాకుండా మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

1113


ఇస్మార్ట్ శంకర్' కంటే ముందు తెలుగులో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశారు నభా నటేష్. మరో కన్నడ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. అయితే, ఆమె కెరీర్ మొత్తంలో ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ హిట్. సుధీర్ బాబుకు జంటగా నటించిన 'నన్ను దోచుకుందువటే' మంచి విజయం సాధించింది. కానీ, 'అదుగో' ఫ్లాప్ అయ్యింది. 

1213

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.   'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మాస్ మహారాజా రవితేజకు జోడీగా 'డిస్కో రాజా', సాయి ధరమ్ తేజ్ సరసన 'సోలో బ్రతుకే సో బెటర్' మోస్తరు విజయాలు సాధించాయి. 'అల్లుడు అదుర్స్', ఓటీటీలో విడుదలైన 'మేస్ట్రో'కి అంతగా పేరు రాలేదు. రీ ఎంట్రీలో 'ఇస్మార్ట్ శంకర్' స్థాయి విజయం అందుకోవాలని నభా నటేష్ కృషి చేస్తోంది.

1313

కసిగా చూస్తూ కళ్ళు చెదిరే ఫోజులు ఇవ్వడంలో తనకు తానే సాటి అని నభా నిరూపించుకుంది.మ్యాస్ట్రో తర్వాత నభా నటేష్ ఎలాంటి చిత్రంలో నటించలేదు. గత రెండేళ్లుగా ఆమె ఖాళీగానే ఉంది. ఆమె క్యాలెండర్ లో 2022, 2023 ఖాళీ అనే చెప్పాలి. ఈ ఏడాది అయినా ఆమెకు ప్రారంభమవుతుందేమో చూడాలి. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Recommended image2
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Recommended image3
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved