MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meena Kumari: ఇది కథ కాదు సీరియల్ స్టార్ మీనాకుమారి గుర్తుందా? చిరంజీవి, వెంకటేష్ ఆన్ స్క్రీన్ చెల్లెలు ఇప్పుడేం చేస్తోంది?

Meena Kumari: ఇది కథ కాదు సీరియల్ స్టార్ మీనాకుమారి గుర్తుందా? చిరంజీవి, వెంకటేష్ ఆన్ స్క్రీన్ చెల్లెలు ఇప్పుడేం చేస్తోంది?

Meena Kumari: ఒక వైపు వరుసగా సీరియళ్లు.. మరో వైపు సినిమాల్లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు చెల్లెలు పాత్రలు. కెరీర్ ను ఫుల్ బిజీగా గడిపిన నటి మీనా కుమారి ఇప్పుడేం చేస్తోంది? ఎక్కడుంటోంది? ఫ్యామిలీ వివరాలు ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 12 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెండితెర నుండి బుల్లితెర వరకు మీనాకుమారి ప్రయాణం
Image Credit : Asianet News

వెండితెర నుండి బుల్లితెర వరకు మీనాకుమారి ప్రయాణం

తెలుగు చలనచిత్ర రంగంతో పాటు టెలివిజన్ రంగంలో కూడా తన సహజసిద్ధమైన అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటీమణులలో మీనాకుమారి ఒకరు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో జీవించి, పాత్ర ఏదైనా సరే అందులో పూర్తిగా లీనమై నటించడం ఆమె ప్రత్యేకత. చాలామంది మీనాకుమారిని తమిళ నటిగా భావిస్తూ ఉంటారు. అయితే ఆమె పక్కా తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి. ఆ రోజుల్లో సినీ పరిశ్రమ మద్రాసు (చెన్నై) లో ఉండటంతో, ఆమె కుటుంబంతో సహా చెన్నైలోనే స్థిరపడాల్సి వచ్చింది. భాషతో సంబంధం లేకుండా తమిళం, మలయాళం మరియు తెలుగు భాషలలో ఆమె ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో నటించి మెప్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిరంజీవి, వెంకటేష్ కు చెల్లెలుగా..
Image Credit : our own

చిరంజీవి, వెంకటేష్ కు చెల్లెలుగా..

మీనాకుమారి మూవీ కెరీర్ లో చెరగని ముద్ర వేసిన సినిమాలు 'హిట్లర్' - 'జయం మనదేరా'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ సినిమాలో ఆయన ఐదుగురు చెల్లెళ్ళలో ఒకరిగా మీనాకుమారి అద్భుత నటనను కనబరిచారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమారు 50 నుండి 55 రోజుల పాటు చిత్రబృందంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో చిరంజీవి గారు చెల్లెళ్ళ పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండే వారని, పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఎంతో రక్షణగా చూసుకునే వారని ఆమె పేర్కొన్నారు.

ఇక జయం మనదేరా విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో చెల్లెలి పాత్రలో మీనాకుమారి చూపిన అభినయం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. చిన్న వయసులోనే తన వయస్సుకు మించిన ప్రాధాన్యత ఉన్న వైట్ హెయిర్ (అమ్మ/పిన్ని) పాత్రలను కూడా స్వీకరించి, గ్లామర్ కంటే నటనకే ఇంపార్టెన్స్ ఇచ్చిన గొప్ప నటి మీనాకుమారి. సెంటిమెంట్ సీన్స్ కు ఆమె పెట్టింది పేరు. కష్టాలు కన్నీళ్ల పాత్రలు అద్భుతంగా పండించేది మీనాకుమారి.

34
బుల్లితెరపై మహారాణిగా మీనాకుమారి
Image Credit : our own

బుల్లితెరపై మహారాణిగా మీనాకుమారి

సినిమాలతో పాటు బుల్లితెరపై (టెలివిజన్ సీరియల్స్) మీనాకుమారి సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆమె సుదీర్ఘ నటనా ప్రయాణంలో దాదాపు సగం కెరీర్ సీరియల్స్ కే ఇచ్చేసంది. అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఏవిఎం' (AVM Productions)తోనే గడిచింది. ఏవిఎం వారి నిర్మాణంలో హీరోయిన్‌గా, కీలక పాత్రధారిగా దాదాపు 5-6 మెగా సీరియల్స్ లో ఆమె నటించారు. అంతేకాకుండా, దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ గారి 'కవితాలయ ప్రొడక్షన్స్' లోనూ వర్క్ చేశారు.

తెలుగు సీరియల్స్ లో చెరగని ముద్ర..

మీనా కుమారి తెలుగు సీరియల్స్ లో కూడా నటించి ఏడిపించారు. తమిళం నుంచి తెలుగుకు డబ్ అయిన ఇది కథ కాదు సీరియల్ లో రాధిక కూతురుగా ఆమె నటన అద్భుతం. ఇక ఈటీవీలో 'అనుబంధం' సీరియల్ లో అచ్యుత్ చెల్లెలిగా సెంటిమెంట్ ను, ఆతరువాత విలన్ గా అన్నను కష్టపెట్టే పాత్రలో మీనాకుమారి నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ సీరియల్ లో ఆమె నటనకు గాను అత్యుత్తమ 'నంది అవార్డు' (Nandi Award) వరించింది. అలాగే ఇఆతరువాత కాలంలో మీనాకుమారి నటించిన తల్లి పాత్రకు బెస్ట్ మదర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

44
మీనా కుమారి ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితం
Image Credit : Asianet News

మీనా కుమారి ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితం

ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా తొలిసారిగా మీనాకుమారి గారి కుటుంబ సభ్యుల గురించి వెల్లడించారు. భర్త కృష్ణమోహన్ బిజినెస్ రంగానికి చెందిన వ్యక్తి. కృష్ణమోహన్ ఎప్పుడూ ప్రశాంతంగా, సర్దుకుపోయే తత్వంతో ఉంటారని, ఆమె ఎదుగుదలకు ఆయన అందించిన ప్రోత్సహమే కారణమని తెలిపారు. తిరుపతి సమీపంలో వారికి మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఇక మీనా కుమారి దంపతులకు ఒక కుమారుడు. ఆయనపేరు మనోజ్. మీనాకుమారి గారి ఏకైక కుమారుడు మనోజ్ కుమార్ అనస్థీషియా & క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. చిన్నతనంలో అమ్మ పడిన కష్టాన్ని, షూటింగ్ బిజీని ప్రత్యక్షంగా చూసిన ఆయన, సొంత కష్టంతో వైద్య రంగాన్ని ఎంచుకున్నట్లు వివరించారు. ఆయన భార్య కూడా సైకియాట్రిస్ట్ కావడం విశేషం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగుదేశం పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..
Recommended image2
Yamuna: 55 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved