MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాళవికా మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ మెరుపులు..

మాళవికా మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ మెరుపులు..

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ త్వరలో టాలీవుడ్ కు ఎంట్రీకి ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో సందడి చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పుట్టిన రోజు వేడుకల ఫొటోలను పంచుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 05 2023, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan)  పుట్టిన రోజు వేడుకలను చాలా సింపుల్ గా జరుపుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓ హోటల్ లో ఈ ముద్దుగుమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా.. తన స్నేహితులతో కలిసి జరుపుకుంది. పుట్టిన రోజు సందర్భంగా మాళవికా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. బాడీకాన్ డ్రెస్ లో బర్త్ డే గర్ల్ అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. 
 

36

తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ పుట్టిన రోజు తనకు స్పెషల్ గా నిలిచిపోతుందని క్యాప్షన్ లో పేర్కొంది. ఇక కేరళలో పుట్టిన మాళవికా ముంబైలోనే పెరిగింది. ఈ ఏడాదితో 29వ ఏటా అడుగుపెట్టింది. 
 

46

అయితే, మాళవికా ప్రస్తుతం కోలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపే సాధించుకుంది. వరుసగా అక్కడ ఆఫర్లు అందుకుంటోంది. త్వరలో చియాన్ విక్రమ్ - పా. రంజిత్ కాంబోలో వస్తున్న ‘తంగలాన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఈమె ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. 
 

56

కేవలం గ్లామర్ రోల్స్ లోనే కాకుండా విభిన్న పాత్రలను కూడా పోషించేందుకు మాళవికా ఆసక్తి చూపిస్తోంది. కేరీర్ లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ సినిమాల విషయంలో ఆచీతూచీ అడుగులేస్తోంది. ‘తంగళాన్’తో భారీ సక్సెస్ అందుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

66

ఇక మాళవికా ఎప్పటి నుంచో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంటూ ఓ సందర్భంలో తానే స్వయంగా వెల్లడించింది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ సినిమాలో అవకాశం దక్కించుకుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మ పంట పండినట్టే. ఈ ఏడాదైనా ఈ బ్యూటీ ఎంట్రీ ఉంటుందా? అన్నది చూడాలి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved