నల్లగా ఉండేది, పనిమనిషి పాత్రలు చేసేది.. మంత్రి రోజాపై నటి షాకింగ్ కామెంట్స్..
ఏపీ మంత్రి రోజాపై నటి మాధవి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు నటిగా ప్రారంభంలో రోజా ఎలా ఉండేదో, ఆమెని ఎగతాళి చేసిన విషయాలను బయటపెట్టింది.
RK Roja
మంత్రి రోజా అంతకు ముందు హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. తెలుగు, తమిళం, కన్న, మలయాళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ముఖ్యంగా తమిళం, తెలుగులోనూ ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక్కడే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది రోజా. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి టర్న్ తీసుకుని మొదట్లో స్ట్రగుల్ అయ్యింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల ఏపీలో మంత్రి అయ్యారు.
అంతకు ముందు జబర్దస్త్ షోకి జడ్జ్ గా చేసి మరింత పాపులర్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. సినిమాల కంటే జబర్దస్త్ ఆమెకి క్రేజ్‌ని తీసుకు రావడం విశేషం. అయితే ఆమె కెరీర్ 1991లో `ప్రేమ తపస్సు` చిత్రంతో ప్రారంభమైంది. ఇందులో హీరో రాజేంద్రప్రసాద్. ఆయనకు జోడీగా రోజా నటించింది. ఇందులో ఆమె పాత్రకి సంబంధించిన షాకింగ్ విషయం వెల్లడించింది నటి మాధవి రెడ్డి. ట్రీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది.
రోజా తాను క్లాస్ మేట్స్ అని చెప్పింది. తిరుపతిలో డిగ్రీలో తాము క్లాస్ మేట్స్ అని, ఆమె స్టడీస్‌లో ఫస్ట్ ఉండేదని, చాలా తెలివైనదని వెల్లడించారు. స్పాంటినిటీ ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే తాను ఎంబీబీఎస్ చేయాలని కాలేజీకి సరిగా వెళ్లలేదని, దీంతో రోజాతో క్లోజ్ ర్యాపో లేదన్నారు. కానీ మామూలు పరిచయం మాత్రం ఉండేదన్నారు. అయితే ఆమెకి `ప్రేమ తపస్సు`లో అవకాశం వచ్చినప్పుడు ఆ షూటింగ్ కి తాము వెళ్లామని, అందులో రోజా పనిమనిషి పాత్ర పోషించిందని, దీంతో పనిమనిషి పాత్ర కరెక్ట్ గా సరిపోయింది, నల్లగా ఉంటావని ఎగతాళి చేసేవాళ్లమని తెలిపింది మాధవి రెడ్డి వెల్లడించింది.
ఆ తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి షోకి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మళ్లీ కలిశామని, అయితే ఆమె పెద్దగా గుర్తుపట్టలేదని, తాను కామ్‌గా ఉండేదని తెలిపింది. ఇక రోజాకి తమిళంలో చేసిన మూవీ బ్రేక్ ఇచ్చిందని, దీంతో ఇక స్టార్ అయిపోయిందని, వరుసగా ఎన్నో సినిమాలు చేసిందన్నారు మాధవి రెడ్డి. ఇప్పుడు రాజకీయాల్లో రాణించడంపై చెబుతూ, ఆమె చాలా ఇంటలిజెంట్ అని, మాట తీరు ఉంటుంది, ధైర్యం ఉందని అందుకే రాణించిందన్నారు. ఆ దైర్యం లేకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టమని, దానితో ఇప్పుడు మంత్రిగా ఎదిగిందని ప్రశంసలు కురిపించింది.
ఇప్పుడు రాజకీయాల్లో రాణించడంపై చెబుతూ, ఆమె చాలా ఇంటలిజెంట్ అని, మాట తీరు ఉంటుంది, ధైర్యం ఉందని అందుకే రాణించిందన్నారు. ఆ దైర్యం లేకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టమని, దానితో ఇప్పుడు మంత్రిగా ఎదిగిందని ప్రశంసలు కురిపించింది.
నటి మాధవి రెడ్డి తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. అమ్మ పాత్రలకు పరిమితమయ్యింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ లోనూ చేస్తూ రాణిస్తుంది. అయితే బోల్డ్ పాత్ర, గ్లామర్ పాత్రలకు తాను దూరమని, అందుకే అవకాశాలు తగ్గాయని, ఇప్పటికీ చాలా సెలక్టీవ్‌గానే సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది.