MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భగవంత్ కేసరి, ఆదిపురుష్ పై నటి తీవ్ర వ్యాఖ్యలు.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేవాళ్ళు రియల్ లైఫ్ లో..

భగవంత్ కేసరి, ఆదిపురుష్ పై నటి తీవ్ర వ్యాఖ్యలు.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేవాళ్ళు రియల్ లైఫ్ లో..

హీరోల చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం చాలా మంచి విషయం. అదే సమయంలో డైలాగులు చెప్పడం వరకే కాదు.. చెప్పేవారు రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే మంచిది అంటూ మాధవీలత బాంబు లాంటి సెటైర్ పేల్చింది.

Sreeharsha Gopagani | Published : Nov 08 2023, 02:32 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

నటి మాధవీలత గురించి పరిచయం అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో మాధవీలత స్నేహితుడా, నచ్చావులే లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మాధవీలత టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటి సంఘటనలపై నోరు విప్పి సంచలనం సృష్టించింది. 

26
Asianet Image

ఈ క్రమంలో ఆమె కొందరు సెలెబ్రిటీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నానో వివరించింది. అప్పటి నుంచి మాధవీలత సోషల్ మీడియాలో పాపులర్ అయింది. మాధవీలత ఎలాంటి పోస్ట్ చేసిన, కామెంట్స్ చేసినా వైరల్ అవుతుంటాయి. 

36
Asianet Image

తాజాగా మాధవీలత మరోసారి తన నోటికి పని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో మాధవి లతా స్టార్ హీరోలని.. వారి చిత్రాలనే టార్గెట్ చేసింది. ప్రభాస్ నటించిన చివరి చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రంపై ఎలాంటి విమర్శలు, నెగిటివ్ టాక్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంపై మాధవీలత తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. 

46
Asianet Image

ఆదిపురుష్ ఒక బ్లండర్, డిజాస్టర్, డర్టీ చిత్రం. హిందువులని డివైడ్ చేయడానికే ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. రీసెంట్ గానే ఆదిపురుష్ చిత్రాన్ని తాను వీక్షించినట్లు మాధవి లతా పేర్కొంది. ఇక బాలయ్య రీసెంట్ మూవీ భగవంత కేసరిపై కూడా మాధవీలత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

56
Asianet Image

హీరోల చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం చాలా మంచి విషయం. హీరోయిన్ పాత్రని గ్లామర్ కి పరిమితం చేసి హీరో చేత ఇలాంటి డైలాగులు చెప్పించకూడదు. కానీ భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల పాత్ర చాలా బావుందని నేను విన్నాను. 

66
Asianet Image

అదే సమయంలో డైలాగులు చెప్పడం వరకే కాదు.. చెప్పేవారు రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే మంచిది అంటూ మాధవీలత బాంబు లాంటి సెటైర్ పేల్చింది. అలా చేయకపోతే చేసేది శివపూజలు దూరేది ఇంకేదో అన్నట్లుగా ఉంటుందని మాధవీలత పేర్కొంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
ప్రభాస్
 
Recommended Stories
Top Stories