- Home
- Entertainment
- లయ రీఎంట్రీ.. 13ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి.. ఏకంగా పాన్ ఇండియా సినిమాతో.. ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్
లయ రీఎంట్రీ.. 13ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి.. ఏకంగా పాన్ ఇండియా సినిమాతో.. ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది నటి లయ. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో మెప్పించింది. తెలుగమ్మాయిగా మరింత దగ్గరయ్యింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న లయ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది నటి లయ. కామెడీ సినిమాలతో మెప్పించింది. గ్లామర్ షోకి కాకుండా ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. సెకండ్ రేంజ్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. జగపతిబాబు, శ్రీకాంత్, శివాజీ, వేణు తొట్టెంపూడి, వడ్డే నవీన్, జేడీ చక్రవర్తి వంటి హీరోలతో జోడీ కట్టి ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైంది లయ. విదేశాల్లో సెటిల్ అయ్యింది.
అయితే ఇటీవల మళ్ళీ సినిమాలపై ఆసక్తి చూపించింది. ఆ మధ్య ఓ టీవీ షోలో మెరిసింది. ఉగాది ప్రోగ్రామ్‌తో కమ్‌బ్యాన్ అయిన ఈ హోమ్లీ బ్యూటీ నటిగానూ రీఎంట్రీ ఇస్తుంది. త్వరలో ఆమె వెండితెరపై సందడి చేయబోతుంది. ఓ పాన్ ఇండియా సినిమాతో ఆమె టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. రామ్‌చరణ్ సినిమాలో లయ నటించబోతుందని సమాచారం. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతుంది.
త్వరలోనే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మరో సినిమాని పట్టాలెక్కించబోతున్నారు రామ్‌చరణ్. ఇందులో కీలక పాత్ర కోసం లయని సంప్రదించారట. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఆమె ఒప్పుకుంటే లయ రీఎంట్రీ కన్ఫమ్ అయినట్టే అని అంటున్నారు. మరిఏం జరుగుతుందో చూడాలి. అయితే లయ కూడా తిరిగి సినిమాల్లో నటించాలనే ఆలోచనలో ఉన్నారు. తెలుగు సినిమా రేంజ్ పెరిగిన నేపథ్యంలో తాను మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమవుతుందట.
మన తెలుగమ్మాయి అయిన లయ `భద్రంకొడుకో` చిత్రంతో 1992లో బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది. వేణు తొట్టెంపూడి `స్వయంవరం` చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. `మా బాలాజీ`, `మనోహరం`, `మనసున్న మహారాజు`, `కోదండ రాముడు`, `రామ్మ చిలకమ్మా`, `హనుమాన్ జంక్షన్`, `ప్రేమించు`, `మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `కొండవీటి సింహాసనం`, `శివరామరాజు`, `నీ ప్రేమకై`, `నువ్వు లేక నేను లేను`, `దొంగరాముడు అండ్ పార్టీ`, `మిస్సమ్మ`, `టాటా బీర్లా మధ్యలో లైలా`, `విజయేంద్రవర్మ`, `గజేంద్ర` వంటి సినిమాలు చేసింది. `బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం`(2010) సినిమాలో చివరగా మెరిసింది.
ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న లయ. ఫ్యామిలీ సినిమాలతో 2006 వరకు అలరించింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని 2006లో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాకు దూరంగా ఉంటోంది. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీకి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో చూడాలి.