కరెంట్ వైర్లతో నా భర్తని చంపించింది.. హీరోయిన్ పై నటి కృష్ణ వేణి సంచలన వ్యాఖ్యలు
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తనకంటూ మంచి గుర్తింపు పొందిన నటి కృష్ణ వేణి. వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడి కమెడియన్ గా కృష్ణవేణి రాణించింది.

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తనకంటూ మంచి గుర్తింపు పొందిన నటి కృష్ణ వేణి. వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడి కమెడియన్ గా కృష్ణవేణి రాణించింది. ఆమె లైఫ్ లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వేణి తన జీవితంలో డార్క్ సీక్రెట్స్ ని బయట పెట్టింది.
అప్పట్లో లేడి కమెడియన్ గా రాణించిన వారిలో శ్రీలక్ష్మి, కృష్ణవేణి లాంటి నటీమణుల పేర్లు ప్రధానంగా వినిపించేవి. తన మొదటి పెళ్లి పెటాకులు కావడంతో చంకలో బిడ్డని వేసుకుని ఇండస్ట్రీకి వచ్చానని కృష్ణవేణి అన్నారు. ఇండస్ట్రీలో అప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో వారాలబ్బాయి, శ్రీమతిగారు, ముగ్గురు మిత్రులు చిత్ర దర్శకుడు రాజాచంద్రతో పరిచయం ఏర్పడినట్లు కృష్ణవేణి తెలిపారు.
రాజాచంద్రలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఆయన ప్రతిభావంతుడైన దర్శకుడు. ఒకసారి సెట్స్ లో నన్ను తిడితే ధీటుగా బదులిచ్చాను. ఆ తర్వాత ఆయనతో చనువు ఏర్పడింది. రాజాచంద్ర చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. ఇంటికి అద్దె కట్టలేని స్థితిలో ఆయన ఉన్నారు. టీ నల్లగా ఉన్నా నేను తాగను. నలుపంటే అసలు నచ్చదు నాకు. లాంటిది నల్లగా ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కృష్ణ వేణి అన్నారు.
మీ లాంటి వాళ్ళు ప్రోత్సాహిస్తేనే కదా మేము ఎదిగేది అని నాతో అంటూ ఉండేవారు. అలా ఆయన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది అని కృష్ణవేణి అన్నారు. మా వివాహం తర్వాత ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు వంద రోజులు ఆడాయి. మంచి ఫ్యామిలీ చిత్రాలు చేశారు.
దీనితో ఆయన ఎదుగుదలకి ఓర్వలేక కొందరు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. అసలు వాస్తవం నాకు తెలుసు. రాజా చంద్ర హత్య వెనుక ఓ ప్రముఖ హీరోయిన్ హస్తం ఉంది. కరెంటు వైర్లు పెట్టి మరీ హత్య చేయించింది అంటూ కృష్ణవేణి సంచలన ఆరోపణ చేసింది. కానీ ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు.
కానీ ఆ హీరోయిన్ కూడా షుగర్ తో దారుణంగా చనిపోయింది అని, పాపం అనుభవించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ హీరోయిన్ తో పాటు కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఈ హత్య వెనుక ఉన్నారు. పోలీసులు కూడా అదే విషయం చెప్పి.. తాము ఏమీ చేయలేము అని.. ఇకపై భద్రత కల్పిస్తామని అన్నారు. అలా తాను ఇండస్ట్రీలో ఎన్నో బాధలు అనుభవించినట్లు కృష్ణ వేణి పేర్కొంది.