- Home
- Entertainment
- అసలు ప్రభాస్ రాముడిలా ఉన్నాడా? ఆదిపురుష్ పై గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి విమర్శలు!
అసలు ప్రభాస్ రాముడిలా ఉన్నాడా? ఆదిపురుష్ పై గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి విమర్శలు!
ఆదిపురుష్ మూవీపై సీనియర్ నటి కస్తూరి కీలక కామెంట్స్ చేశారు. ఆమె ఆదిపురుష్ చిత్రాన్ని తప్పుబట్టారు. అసలు ప్రభాస్ రాముడిలా లేరు అన్నారు.

Adipurush
ఆదిపురుష్ స్టార్ట్ చేసిన మూహూర్తం బాగోలేదు, అన్నీ వివాదాలే. టీజర్ విడుదలతో మొదలైన వ్యతిరేకత కొనసాగుతుంది. గత ఏడాది అక్టోబర్ లో ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. రావణాసురుడు గెటప్ పై విమర్శలు వెల్లువెత్తాయి. రావణాసురుడు శివ భక్తుడు, మీకు ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా అని మండిపడ్డారు. అసలు ఓం రౌత్ కి రామాయణం తెలుసా అంటూ ఏకిపారేశారు.
అనంతరం దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ తిరుమలలో కౌగిలించుకుని ముద్దులు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. పూజా దుస్తుల్లో ఉన్న ఓం రౌత్, కృతి సనన్ మర్యాదపూర్వకంగా హగ్ చేసుకున్నారు. ఓం రౌత్ ఆమె బుగ్గలపై ముద్దు పెట్టాడు. ఇది పాశ్చాత్య తరహా పలకరింపు. తిరుమల మాడవీధుల్లో ఇలా చేయడం విమర్శలకు దారి తీసింది.
హిందూవాదులు కృతి సనన్, ఓం రౌత్ లను ఏకిపారేశారు. దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణంలో సీతగా నటించిన దీపికా చికిలా సైతం విమర్శలు చేశారు. తిరుమలలో దర్శకుడు, హీరోయిన్ ని ముద్దుపెట్టుకోవడాన్ని ఆమె ఖండించారు. తాజాగా మరోనటి ఆదిపురుష్ పై విమర్శలు చేసింది.
సీనియర్ నటి కస్తూరి అసలు ప్రభాస్ రాముడిలా లేదని షాకింగ్ కామెంట్ చేశారు. గతంలో సౌత్ ఇండియా నటులు పలువురు రాముడు పాత్ర చేశారు. వారు ఆ గెటప్ లో రాముణ్ణి తలపించారు. ప్రభాస్ రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు అన్నది. రాముడు, లక్ష్మణుడు పాత్రలకు మీసాలు ఏమిటని ప్రశ్నించింది. కస్తూరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడు పాత్ర చేస్తున్నారు. జానకిగా కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడు పాత్ర చేయాడు.