- Home
- Entertainment
- Kajal Aggarwal Post : మాతృత్వ అనుభవాన్ని పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
Kajal Aggarwal Post : మాతృత్వ అనుభవాన్ని పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
మరికొద్ది రోజుల్లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం శారీరకంగానూ, మానసికంగానూ తన ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తోంది. తాజాగా తన మాతృత్వ అనుభవాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది కాజల్.

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సౌత్ ఆడియెన్స్ కు ఎంతో సుపరిచితం. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. విభిన్న పాత్రలతో అలరించిన కాజల్.. వివాహానంతరం కూడా సినిమాలు చేస్తూనే ఉంది.
అయితే ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపరవేత్త గౌతమ్ కిచ్లు (Goutam Kichlu)ని ప్రేమించి పెండ్లి చేసుకుంది. ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెన్సీ డేస్ ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందీ సుందరి.
మరోవైపు తన హెల్త్ విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది కాజల్. తాజాగా మాతృత్వ అనుభవాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. మాతృత్వంపై భావోద్వేగమైన నోట్ రాసింది.
నోట్ లో.. ‘మాతృత్వానికి సిద్ధపడడం అందంగా ఉంటుంది. కానీ దారుణంగానూ గజిబిజిగా ఉంటుంది. ఒక్క క్షణం మీకు అన్నీ ఉన్నట్లు అనిపిస్తుంది. అంతా నియంత్రణలోనే ఉన్నట్టుగా భావిస్తాం. ఆ తరువాతి క్షణాలు అంతుచిక్కకుండా ఉంటాయి. మరియు రోజులు, వారాలు, నెలలలో మన భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు వారితో ఆనందం, విచారంగా, ఆందోళనగా, హృదయ విదారకర భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే కొన్ని సార్లు మనం ఈ భావోద్వేగాను వ్యక్తపరచడం మరచిపోతాం’ అంటూ పేర్కొంది.
ముఖ్యంగా కాజల్ హెల్త్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏరోబిక్స్ మరియు స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలు కూడా చేస్తోంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు లేని గర్భిణులు తప్పనిసరిగా ఏరోబిక్ మరియు స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలలో పాల్గొనాల్సిందేనని ప్రోత్సహిస్తోంది.
కేరీర్ పరంగా చూస్తే కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉండటంతో కాస్తా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరిగా ‘హే సినామికా’ చిత్రంతో అలరించింది కాజల్.. ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరసన ‘ఆచార్య’లో నటించింది. అలాగే హిందీ, తమిళ చిత్రాల్లోనూ వరుస చిత్రాల్లో నటించింది.