నా ఫ్యామిలిలో మొత్తం 14 మంది, వ్యాంప్ పాత్రలు చేసే పోషించా..చిరుకి హీరోయిన్ ఛాన్స్ మిస్, నటి జయలలిత ఎమోషనల్
తెలుగు సీనియర్ నటి జయలలిత దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోదగ్గ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
తెలుగు సీనియర్ నటి జయలలిత దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోదగ్గ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
అందరిలాగే తనకి కూడా తెరవెనుక కన్నీటి కష్టాలు ఉన్నట్లు జయలలిత తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కెరీర్ ఆరంభంలో తనకి వచ్చిన అవకాశాలు చేజారకుండా ఉండిఉంటే ఇప్పటికంటే బెటర్ పొజిషన్ లో హీరోయిన్ గా ఉండేదాన్ని అని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రంలో సుమలత పోషించిన పాత్ర మొదట తనకే వచ్చింది అని జయలలిత పేర్కొంది. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. నన్ను చూసి తిరుపతి రెడ్డి గారు అమ్మాయి బాగుంది.. ఖైదీ చిత్రంలో ఒక క్యారెక్టర్ ఇవ్వాలని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆ పాత్ర సుమలతకి వెళ్ళిపోయింది.
నేను వ్యాంప్ పాత్రలు కోరుకుని ఏమీ చేయలేదు. హీరోయిన్ గా అవకాశాలు చేజారుతుండడంతో చిన్న పాత్రలని సైతం అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మేము ఐదురుగు తోబుట్టువులం. వారి పిల్లలతో కలిపి ఇంట్లో మొత్తం 14 మంది ఉంటాం. ఆదాయ మార్గం ఏమిలేదు. కుటుంబ భారం మొత్తం నాపైనే. దీనితో వ్యాంప్ పాత్రలని పోషించేందుకు కూడా అంగీకరించాల్సి వచ్చింది అని జయలలిత తెలిపారు.
ఆ సమయంలో నేను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని దర్శకుడు ఐవి శశి చూశారు. కమల్ హాసన్ చిత్రంలో కీలకమైన పాత్ర ఒకటి ఉంది. కాకపోతే అది వ్యాంప్ తరహాలో ఉంటుంది అని చెప్పారు. ఆ సమయంలో నా వయసు 23 ఏళ్ళు. కనీసం వ్యాంప్ అంటే ఏంటో కూడా తెలియదు. కమల్ హాసన్ చిత్రం కావడంతో ఓకె చెప్పేశా. ఆ విధంగా తనకు వరుసగా వ్యాంప్ రోల్స్ వచ్చినట్లు జయలలిత పేర్కొంది.
కుటుంబాన్ని తీసుకుని సొంత ఊరికి తిరిగి వెళ్లలేక.. తప్పని పరిస్థితుల్లో వ్యాంప్ పాత్రలు చేశాను అంటూ జయలలిత ఎమోషనల్ అయ్యారు. జయలలిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.