MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hema Love Story : 19 ఏళ్లకే ముస్లిం వ్యక్తితో రిజిస్టర్ మ్యారేజ్.. నటి హేమ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్టులు.!

Hema Love Story : 19 ఏళ్లకే ముస్లిం వ్యక్తితో రిజిస్టర్ మ్యారేజ్.. నటి హేమ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్టులు.!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్ననటి హేమ (Actress Hema) చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ, పెళ్లి, ఆ తర్వాత ఎదురైన సవాళ్లను వివరించారు. ఊహించని ట్విస్టులతో తన ప్రేమకథను చెప్పింది. 

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Dec 22 2023, 08:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ బాగా సుపరిచితం. 1989 నుంచి మొన్నటి వరకు సినిమాల్లో చాలా యాక్టివ్ గా కనిపించారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 200కిపైగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాలు, విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. 

28

ఇక హేమ తరుచుగా మీడియాలో కనిపిస్తూనే ఉండేవారు. ఇటీవల కాస్తా గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ, పెళ్లి, ఆ తర్వాత ఎదురైన సవాళ్లను వివరించారు. ఊహించని ట్విస్టులతో తన ప్రేమకథను చెప్పింది. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. వీరి కూతురు ఉంది.
 

38

తన ప్రేమ కథను చెబుతూ.. ‘నేను దూరదర్శన్ లో వర్క్ చేసినప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అక్కడే తను కూడా అసిస్టెంట్ గా కెమెరా మెన్ గా పనిచేస్తూ ఉండేవారు. ఓరోజు కలిసిన ఫస్ట్ మీటింగ్ లోనే జాన్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు నా వయస్సు18 దాటుతోంది. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మోసం చేసే వ్యక్తి కాదని అర్థమైంది. 
 

48

ఇక అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడటం మొదలైంది. రోజూ కబుర్లు చెప్పుకోవడం జరుగుతున్నాయి. ఓ రోజు మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. అయితే మాది రిజిస్టర్ మ్యారేజ్. తను ముస్లిం కావడంతో మళ్లీ తలాక్.. తలాక్ చెప్పి మరో పెళ్లిచేసుకుంటారనే సందేహం ఉండేది. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ కే ఒప్పుకున్నాను.

58

పెళ్లాక కొద్దిరోజులకు ఇంట్లో విషయం తెలిసింది. మా అమ్మ కోప్పడింది. అప్పటికే నా కెరీర్ పీక్స్ లో ఉండటం.. నేను మ్యారేజ్ చేసుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. కానీ కొద్దిరోజుల తర్వాత ఇరుకుటుంబాలు కలిసి రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీ నుంచి కూడా సెలబ్రెటీలు వచ్చారు. అలా పెళ్లి జరిగింది.
 

68

ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ట్ అయ్యింది. నెలకు 4 వేల సంపాదనతోనే జీవించాం. నాకు పెద్దగా ఆశలు లేవు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండేవాళ్లం. భవిష్యత్ పైనా క్లారిటీ ఉంచుకున్నాను. తను ఇంగ్లీష్ మాట్లాడగలడు, చదువు ఉంది.. కెమెరా మెన్ గా సక్సెస్ కాకపోతే ఏదో ఉద్యోగం చేసి పోషిస్తాడనే ధైర్యంతోనే తనని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. చక్కటి జీవితం కొనసాగింది.’ అంటూ చెప్పుకొచ్చింది. 
 

78

చిన్నవయస్సులోనే హేమ పెళ్లి.. అందులోనూ రిజిస్టర్ మ్యారేజ్, పైగా ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకోవడం వంటి అంశాలు ఆమె లవ్ స్టోరీలో ఆసక్తికరంగా మారాయి. హేమ ప్రేమ కథలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన జీవితంపై ఎంత క్లారిటీగా, ముందుచూపుతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

88

అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసిన హేమ రెండేళ్లుగా పెద్దగా సినిమాలేవీ చేయలేదు. ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ‘శ్రావ్య’ అనే ఓ చిత్రంలోనూ నటిస్తున్నారని టాక్. ఈ మూవీపై పెద్దగా అప్డేట్స్ లేవు. ఇక హేమ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలోని తన పాత్రకు బెస్ట్ ఫీమేల్ కమెడియన్ గా నంది అవార్డును సొంతం చేసుకుంది.  
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved